https://oktelugu.com/

Jensen Huang: దిగ్గజ కంపెనీ సీఈవో.. తన టాయిలెట్లు కడిగిన కథ చెప్పాడు

జెన్సన్‌ పని విలువను వివరిస్తూ ఇటీవల ఓ వీడియో చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో ఆయన చెప్పిన వివరాలు..‘‘నా వరకు ఏ పనీ నాకు చిన్నది కాదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 4, 2024 / 04:58 PM IST

    Jensen Huang

    Follow us on

    Jensen Huang: సాధారణంగా జీవితంలో ఎవరూ నేరుగా ఉన్నత శిఖరాలు అధిరోహించరు. ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుంటూ పైమెట్టుకు చేరుకోవాలి. అయితే ఈ ప్రయాణంలో దేనినీ తక్కువ చేసి చూపొద్దని అంటున్నారు ప్రముఖ ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌. చేసే పని చిన్నదైనా దానికి విలువ ఇవ్వాలని, గౌరవించాలని అప్పుడే ఎదుగుతామని చెబుతున్నారు.

    పనివిలువపై వీడియో..
    జెన్సన్‌ పని విలువను వివరిస్తూ ఇటీవల ఓ వీడియో చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో ఆయన చెప్పిన వివరాలు..‘‘నా వరకు ఏ పనీ నాకు చిన్నది కాదు.. కేరీర్‌ తొలినాళ్లలో నేను ఓ బ్రేక్‌ఫాస్ట్‌ సెంటర్‌లో పనిచేశా. అప్పుడు గిన్నెలు శుభ్రం చేశా. టాయిలెట్లు కడిగా. ఇక్కడున్న మీ అందరూ కలిసి కడిగినదానికంటే ఎక్కువ టాయిలెట్లు శుభ్రం చేశా. ఆ అనుభవవమే నాకు అన్నిరకాల పనులను గౌరవించడం నేర్పింది. దానివల్ల ఇప్పుడు కంపెనీలో ప్రతీ ఉద్యోగిని సమానంగా చూడగలుగుతున్నా. వారి భుజంపై చేయి వేసి అండగా నిలబడుతున్నా. ఈ ప్రపంచంలో తక్కువ అనే పని ఏదీ లేదు’’ అని సీఈవో హువాంగ్‌ వివరించారు.

    మస్క్‌ స్పందన ఇలా..
    ఈ ఏడాది మార్చిలో స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో మాట్లాడినప్పటి వీడియో ఇది. తాజాగా దీనిని ఓ జర్నలిస్టు షేర్‌ చేయగా ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై టెస్లా, ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. హువాంగ్‌పై ప్రశంసలు కురిపించారు. తనదైన శైలిలో ఓ పోస్టు చేశారు. ‘‘కచ్చితంగా ఇదే సరైన ప్రవర్తన. కోవిడ్‌ వేళ టాయిలెట్‌ పేపర్ల కొరత ఉన్న సమయంలో నేను మా ఫ్యాక్టరీ, ఆఫీసుల్లో వాటిని అందుబాటులో సరిపడా ఉంచగలిగా’ అని పోస్టు చేశారు.