Electrical Cars :2024 ఏడాది ప్రారంభ నెల సందర్భంగా జనవరిలో కొన్ని కంపెనీలు కొత్త వస్తువులను పరిచయం చేశాయి. అలాగే కార్ల కంపెనీలు సైతం ఈ ఏడాదిలో కొత్త వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కొనుగోలుదారులు నేటి కాలంలో ఎక్కువగా Electrical Vehicles (EV) లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు సైతం ఈయూ వెహికల్స్ ఉత్పత్తిపై ఫోకస్ పెట్టయి. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఆ కార్ల వివరాల్లోకి వెళితే..
దేశంలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే వివిధ వేరియంట్లలో కార్లు మార్కెట్లోకి వచ్చి ఆకర్షించాయి. లేటేస్ట్ గా మారుతి కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ పై దృష్టి పెట్టింది. EVX Concept SUV2024 పేరిట మారుతి కొత్త వెహికల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. టయోటా భాగస్వామ్యంతో 27PL స్కేట్ బోర్డ్ ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు మిగతా కార్ల కంటే భిన్నంగా విశాలమైన స్పేస్ తో పాటు బోల్డ్ లుక్ డిజైన్ తో ఆకర్షించనుంది. దీనిని రూ.22 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.
మారుతి నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని అప్డేట్ చేస్తూ 2024లో తీసుకురానున్నారు. కొత్త స్విప్ట్ లో 1.2 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఆకట్టుకునే డిజైన్ లో రానుంది. దీనిని రూ.6 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. దీనిని వచ్చే మార్చి నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నారు. టాటా కంపెనీకి చెందిన కొత్త ఎలక్ట్రిక్ కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో కూడుకొని ఉంది. విశాలమైన స్పేష్ తో పాటు కొత్త డిజిటల్ DNA డిజైన్, ఎల్ ఈడీ లైట్లతో ఆకర్షించనుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ రూఫ్ ఉండనున్నాయి.
హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానుంది. అచ్చం క్రెటాను పోలిన ఈ మోడల్ ను 45kWh బ్యాటరీతో ఉండనుంది. ఇది 138 బీహెచ్ పీ పవర్, 255 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. మారుతి సుజుకీ ఈవీఎక్స్ కు పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. రెండు బ్యాటరీలు అమర్చిన ఈ మోడల్లో ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను అమరుస్తున్నారు. దీనిని సెప్టెంబర్ లో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ కారు రూ.30 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు