https://oktelugu.com/

Electric Car: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 301 కిలోమీటర్లు.. ఆకర్షించే ఈ బుల్లి కారు ధర ఎంతో తెలుసా?

క్లాసిక్ లిటిల్ యాంట్ కంటే ఇది రిఫైండ్, స్పేషన్ గా ఉంటుంది. ఇందులో 10.1 ఇంచెస్ డిస్ ప్లే టచ్ స్క్రీన్, స్లిమ్మర్ ఎయిర్ వెంట్ లతో కూడిన డ్యాష్ బోర్డు ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 8, 2023 / 04:24 PM IST

    Electric Car

    Follow us on

    Electric Car: వాతావరణ కాలుష్యం, చమురు ధరలు పెరిగిపోవడంతో భవిష్యత్ లో ఎలక్ట్రిక్ కార్లు(ఈవీ) హవా సాగించనున్నాయి. ఇప్పటికే కొన్ని మోడళ్లు రోడ్లపై తిరుగుతూ ఆకర్షిస్తున్నాయి. కంపెనీలు సైత ఈవీల ఉత్పత్తిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. భారత్ లోనే కాకుండా చైనా వంటి దేశాలు ఇలాంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ‘చెరీ న్యూ ఎనర్జీ’ అనే కంపెనీ కొత్త కారును పరిచయం చేసింది. దీనిని న్యూ లిటిల్ యాంట్ అని పిలుస్తున్నారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే క్లాసిక్ లిలిట్ యాంట్ వచ్చింది. దీనిని అప్ గ్రేడ్ చేస్తూ ఇప్పుడు న్యూలిటిల్ యాంట్ ను తీసుకొచ్చింది. మరి దీని ఫీచర్స్ గురించి తెలిస్తే దిమ్మదిరుగుద్ది..

    ఇదివరకు వచ్చిన క్లాసిక్ లిటిల్ యాంట్ కంటే ఇది రిఫైండ్, స్పేషన్ గా ఉంటుంది. ఇందులో 10.1 ఇంచెస్ డిస్ ప్లే టచ్ స్క్రీన్, స్లిమ్మర్ ఎయిర్ వెంట్ లతో కూడిన డ్యాష్ బోర్డు ఉంటుంది. లెదర్ సీట్ అప్హోస్టబుల్ డ్రైవర్ సీట్, ఎల్ ఈడీ లైట్లు, ఎయిర్ ఫిల్టర్ తో కూడిన మేకప్ మిర్రర్ ను కలిగి ఉంది. అన్నింటికన్నా ఆకర్షించేది వైర్ లెస్ చార్జర్. అలాగే కంట్రోల్, యాప్ ద్వారా రిమోట్ ఫంక్షన్లు వంటి అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి.

    ఈ మోడల్ పవర్ ట్రెయినర్ గా పనిచేస్తుంది. ఇందులో 50 పీఎస్ పవర్, 95 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మూడు బ్యాటరీ ఆప్షన్ తో విభిన్నంగా ఉంటుంది. 25.05 కిలోవాట్ లిథియం ఐరన్ పాస్పేట్ బ్యాటరీ 251 కిలోమీటర్ల రేంజ్, 28.86 కిలోవాట్ ఎల్ ఎఫ్ ఫీ బ్యాటరీ 301 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హై టార్క్ ప్రొడ్యూస్ ను కూడా చేసుకోవచ్చు. ఇది 40.3 కిలోవాట్ టెర్నరీ లిథియం బ్యాటరీతో ఉంటుంది. ఇది ఏకంగా 408 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం విశేషం.

    న్యూ లిటిల్ కారు ధరను 77,900 యువాన్లుగా నిర్ణయించారు. అంటే ఇండియన్ ప్రైస్ ప్రకారం రూ.8.92 లక్షలు అన్నమాట. దీని టాప్ వేరియంట్ 82,900 (రూ.9.49 లక్షలు) యువాన్లు ఉంది. కొత్త లిటిల్ యాంట్ క్లాసిక్ కంటే స్లీక్, మోడర్న్ డిజైన్ తో పాటు స్మూత్ ఫ్రంట్ ఫాసియాతో న్యూ లిటిల్ యాంట్ ఆకట్టుకుంటుంది. ఇది క్లోజ్డ్ ఆప్ గ్రిల్, కొత్త క్యూక్యూ అనే లోగోతో హెడ్ ల్యాంప్, షార్ప్ లుక్ ను కలిగి ఉంది.