Electric Bike : ఎలక్ట్రిక్ బైక్ తయారీదారు ఓబెన్ ఎలక్ట్రిక్ తన వినియోగదారుల బ్యాటరీ సంబంధిత ఆందోళలను దూరం చేయడానికి సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌కు ‘ప్రొటెక్ట్ 8/80’ అని పేరు పెట్టారు. వినియోగదారులు దీనిని మే 1 నుంచి ఎలక్ట్రిక్ బైక్ కోసం కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు రూ.9,999 చెల్లిస్తే దాదాపు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీపై కంప్లీట్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ బ్యాటరీ వారంటీలో బ్యాటరీ పనితీరు, రిపేరింగ్, రీప్లేస్‌మెంట్, బ్యాటరీకి సంబంధించిన ఏదైనా లోపం ఉన్న అన్ని బాధ్యతలు కంపెనీనే చూసుకుంటుంది.
Also Read : క్రెటా ధరలో ఇన్నోవా లాంటి కారు.. ఫీచర్స్ అదుర్స్.. మే 8న లాంచ్
వారంటీ వ్యవధిలో ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్, యాక్సిలరేషన్ అలాగే ఉంటాయని వినియోగదారులకు హామీ ఇస్తుంది. అంతేకాకుండా, ఈ వారంటీని పూర్తిగా ట్రాన్స్ ఫర్ కూడా చేసుకోవచ్చు. ఓబెన్ LFP బ్యాటరీని మన దేశ వాతావరణానికి అనుగుణంగా రూపొందించారు. వారి బ్యాటరీలు 50శాతం వరకు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలవని, దీని వలన ఎక్కువ వేడిలో కూడా ఎలక్ట్రిక్ బైక్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతోంది.
175 కిమీ రేంజ్ ఇచ్చే బైక్
ప్రొటెక్ట్ 8/80 ప్లాన్ రోర్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ 3.4 kWh, 4.4 kWh బ్యాటరీ ఆఫ్షన్లకు ప్రస్తుత, భవిష్యత్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. రోర్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ గురించి మాట్లాడితే.. ఇది 175 కిమీ IDC రేంజ్‌ను అందిస్తుంది. ఈ బైక్ కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 కిమీ స్పీడ్ అందుకుంటుంది. అంతేకాకుండా బైక్ టాప్ స్పీడ్ 95 కిమీ/గం దగ్గరగా ఉంటుంది. దీని ధర రూ.89,999 ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. కొత్త బ్యాటరీ వారంటీ ప్లాన్ దేశవ్యాప్తంగా ఓబెన్ ఎలక్ట్రిక్ 36 షోరూమ్‌లలో అందుబాటులో ఉంది.
ఓలా బైక్‌తో పోటీ:
ఫీచర్ల విషయానికి వస్తే, ఓబెన్ రోర్ ఈజీలో ఆల్-LED లైటింగ్, ఫ్లోటింగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, జియోఫెన్సింగ్, థెఫ్ట్ ప్రొటెక్షన్, యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ (DAS) మరియు మరెన్నో ఉన్నాయి. ఓబెన్ రోర్ ఈజీపై 3 సంవత్సరాలు/75,000 కిమీ (ఏది ముందు అయితే అది) వారంటీని అందిస్తుంది. ఈ బైక్ Revolt RV400 BRZ వంటి ఎలక్ట్రిక్ బైక్‌లకు పోటీనిస్తుంది. త్వరలో దీనికి పోటీగా Ola Roadster X కూడా రానుంది.