https://oktelugu.com/

ఆధార్, ఓటీపీ వివరాలు చెప్పొద్దంటున్న కేంద్రం.. ఎందుకంటే..?

దేశంలో నివశించే వారికి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మన ఆధార్ కార్డ్ నంబర్ వివరాలు ఇతరులకు తెలిస్తే కూడా మనం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, డిజిటల్ లావాదేవీలపై పెద్దగా అవగాహన లేనివారి సైబర్ మోసాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో మోసగాళ్లు కరోనా వ్యాక్సిన్ కేటాయింపు అంటూ కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. Also Read: సూపర్ స్కీమ్.. పన్నుఆదాతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 27, 2021 / 07:58 PM IST
    Follow us on

    దేశంలో నివశించే వారికి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మన ఆధార్ కార్డ్ నంబర్ వివరాలు ఇతరులకు తెలిస్తే కూడా మనం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, డిజిటల్ లావాదేవీలపై పెద్దగా అవగాహన లేనివారి సైబర్ మోసాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో మోసగాళ్లు కరోనా వ్యాక్సిన్ కేటాయింపు అంటూ కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు.

    Also Read: సూపర్ స్కీమ్.. పన్నుఆదాతో పాటు కోటీశ్వరులయ్యే ఛాన్స్..?

    రోజురోజుకు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రజలను అలర్ట్ చేస్తోంది. మోసగాళ్ల మాయలో పడి మోసపోవద్దని కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా వ్యాక్సిన్ పేరుతో కొందరు మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని.. డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతో కాల్ చేస్తున్నామని చెప్పి ఆధార్, ఓటీపీ వివరాల్ను సేకరిస్తున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.

    Also Read: 2020 సంవత్సరంలో ఎక్కువగా అమ్ముడుపోయిన కారు ఏదో తెలుసా..?

    ఆధార్ కార్డ్ నంబర్, వన్ టైమ్ పాస్ వర్డ్ వివరాలను చెబితే కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని కేంద్రం సూచనలు చేసింది. ఇలాంటి మోసాల బారిన పడకుండా సీనియర్ సిటిజన్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రోజురోజుకు కొత్తకొత్త మోసాలు వెలుగులోకి వస్తుండటంతో వివరాలు చెబితే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది,

    మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

    సైబర్ నేరగాళ్లు మన నుంచి సేకరించిన వివరాలను దుర్వినియోగం చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వ్యక్తిగత వివరాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఎవరైనా కరోనా వ్యాక్సిన్ పేరుతో మోసపూరిత కాల్స్ చేస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే మంచిది.