Dolby Audio Soundbar: పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. వీటిలో Amazon, Flipkart వాటి సంస్థలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ముందుంటాయి. మొన్నటి వరకు న్యూ ఇయర్, సంక్రాంతి సేల్స్ లో నిమగ్నమైన అమెజాన్ సంస్థ ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని వస్తువులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇవి తక్కువ ధరకు అందిస్తూనే బ్యాంకు క్రెడిట్ కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారు.. భవిష్యత్తులో అవసరం పడే వారు డిస్కౌంట్ లో కొనుగోలు చేయడం వల్ల చాలా వరకు డబ్బు సేవ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా రిపబ్లిక్ డే సందర్భంగా వీటిని కొనుగోలు చేయడం వల్ల వాటికి ప్రత్యేక గుర్తింపు ఉండే అవకాశం ఉంటుంది. అయితే 2026 రిపబ్లిక్ డే సందర్భంగా ఓ వస్తువుపై ఆమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఇంతకీ ఆ వస్తువు ఏదో ఇప్పుడు చూద్దాం..
చాలామంది ఇంట్లో అందమైన సంగీతం వినాలని అనుకుంటారు. కొందరు ఈ సంగీతం బేస్ సౌండ్తో ఉండాలని కోరుకుంటారు. టీవీలకు, స్టీరింగ్ ఆడియోకు కరెక్టుగా ఉండే డాల్ఫి సౌండ్ రావడానికి ప్రత్యేకంగా డివైస్లు మార్కెట్లోకి వస్తుంటాయి. వీటిలో Sony కంపెనీకి చెందిన Dolby Audio సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా భారీ డీల్స్ ను ప్రకటించింది. అతి తక్కువ ధరకే దీనిని అందించాలని నిర్ణయించింది. రిపబ్లిక్ డే సందర్భంగా దీనిని కేవలం రూ. 7000కే విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు సోనీ డాల్ఫి సౌండ్ బార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలామంది డాల్ఫి ఆడియో కోరుకునేవారు దీనిని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అయితే మార్కెట్లో ఉన్న ధరపై 40 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో దీనిని కేవలం రూ.8,989 తో విక్రయిస్తున్నారు. ఈ ధరపై రూ.1000 కూపన్ కూడా అందించనున్నారు. అంటే రూ.7,989 కే సొంతం చేసుకోవచ్చు.
అయితే ఈ ధరపై మాత్రమే కాకుండా దీనిని SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% వరకు అదరపు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తంగా రూ.7,091 కు దీనిని కొనుగోలు చేయవచ్చు. సోనీ డాల్బీ ఆడియో ఫీచర్స్ అద్భుతం అని చెప్పవచ్చు. ఇది చాలా స్లీక్ గా, ప్రీమియం డిజైన్ ను పోలి వుంటుంది. దీంతోపాటు మరొక ఉబర్ కూడా అవసరం లేదు. కానీ ఫుల్ రేంజ్ బాస్ స్పీకర్లు వలె అద్భుతమైన సౌండ్ వస్తుంది. మొత్తంగా 120 వాట్ సౌండ్ తో అందమైన సంగీతాన్ని వినవచ్చు. ఇది S ఫోర్స్ ఫ్రంట్ సరౌండ్, LDAC తో కలిపి బ్లూటూత్ కరెక్ట్ అవుతుంది. అలాగే వైర్లెస్ సపోర్ట్ కూడా ఉండనుంది. ఈ సౌండ్ బార్ తో మూవీస్ చూస్తే అద్భుతమైన అనుభూతిని కలుగుతుంది. అంతేకాకుండా భారీ మ్యూజిక్ ఉన్న సంగీతం వింటే హోమ్ థియేటర్ కంటే ఎక్కువగా ఆనందాన్ని పొందవచ్చు. ఇందులో HDMI ఇన్, అవుట్ ఆప్టికల్, USB బ్లూటూత్ వంటి కరెక్టివేట్ సపోర్టులు కలిగి ఉంటుంది.