https://oktelugu.com/

Shah Rukh Khan : పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పేర్లను మర్చిపోయిన షారుఖ్ ఖాన్..మండిపడుతున్న అభిమానులు..అసలు ఏమైందంటే!

షారుఖ్ ఖాన్ దుబాయిలో జరిగిన 'గ్లోబల్ విలేజ్' కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలను ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ 'ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ , అల్లు అర్జున్, యాష్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి నటులు నాకు మంచి స్నేహితులు.

Written By: , Updated On : January 28, 2025 / 09:05 PM IST
Shahrukh Khan

Shahrukh Khan

Follow us on

Shah Rukh Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పై పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ మీదున్నారు. సోషల్ మీడియా లో షారుఖ్ ఖాన్ ని ట్యాగ్ చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా షారుఖ్ ఖాన్ మీద ఎందుకు అంత ఫైర్ అవుతున్నారు, అసలు ఏమైంది అనే విషయానికి ఇప్పుడు వద్దాం. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే షారుఖ్ ఖాన్ దుబాయిలో జరిగిన ‘గ్లోబల్ విలేజ్’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలను ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ , అల్లు అర్జున్, యాష్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి నటులు నాకు మంచి స్నేహితులు. కానీ వీళ్లంతా చాలా వేగంగా డ్యాన్స్ వేస్తుంటారు, వాళ్ళని అందుకోవడం నాకు చాలా కష్టం అవుతుంది. డ్యాన్స్ విషయం లో వీళ్ళను అనుకరించడం చాలా కష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక్కడ షారుఖ్ ఖాన్ సౌత్ లో ఉండే స్టార్ హీరోలందరి పేర్లు చెప్పాడు కానీ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పేర్లు మాత్రం చెప్పలేదు. మహేష్ బాబు, రజినీకాంత్, ప్రభాస్, కమల్ హాసన్ యాష్ వీళ్లంతా డ్యాన్సర్లు కాదు, అయినప్పటికీ వాళ్ళను డ్యాన్స్ యాంగిల్ లో ఉదాహరణగా తీసుకొని మాట్లాడాడు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ని ఎందుకు మినహాయించాడు?, పోనీ పవన్ కళ్యాణ్ కి డ్యాన్స్ రాదు కాబట్టి, అతనితో షారుఖ్ ఖాన్ కి పెద్దగా పరిచయం లేదు కాబట్టి ఆయన పేరు మర్చిపోయి ఉండొచ్చు అనుకుందాం, మరి జూనియర్ ఎన్టీఆర్ పేరుని ఎలా మర్చిపోయాడు?, ఇండియా టాప్ 3 డ్యాన్సర్స్ లిస్ట్ తీస్తే అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉంటుంది. అలాంటి ఎన్టీఆర్ పేరు ని ఎలా మర్చిపోయావు అంటూ ఆయన అభిమానులు షారుఖ్ ఖాన్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు.

ఇకపోతే షారుఖ్ ఖాన్ చాలా కాలం గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో జవాన్, పఠాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలను అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో బాగా వెనుకపడిన షారుఖ్ ఖాన్, ఈ రెండు సినిమాలతో తానూ బౌన్స్ బ్యాక్ అవ్వడమే కాకుండా, బాలీవుడ్ సినీ పరిశ్రమకు కూడా కొత్త ఊపిరిని ఊడినవాడు అయ్యాడు. పైన చెప్పిన విధంగా షారుఖ్ ఖాన్ కి మన సౌత్ లో అంత మంది స్నేహితులు లేరు కానీ, రామ్ చరణ్, మహేష్ బాబు, రజినీకాంత్ మరియు కమల్ హాసన్ వంటి వారు మాత్రం మంచి స్నేహితులే. రామ్ చరణ్ బ్రూస్లీ, మహేష్ బాబు బ్రహ్మోత్సవం మూవీ షూటింగ్స్ సమయంలో వాళ్ళని కలిసి కాసేపు సరదాగా గడిపిన క్షణాలు కూడా షారుఖ్ ఖాన్ కి ఉన్నాయి.