https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ప్రేరణ కోసం ‘లగ్జరీ’ ని త్యాగం చేసిన యష్మీ..కానీ అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది!

సీత క్లాన్ లోకి నబీల్, విష్ణు ప్రియా, ఆదిత్య ఓం, నైనిక వెళ్ళిపోతారు. ఇక ఆ క్లాన్ లో కేవలం ఒక సబ్యులకు మాత్రమే చోటు ఉన్న సమయం లో యష్మీ ఆ క్లాన్ లోకి వెళ్ళిపోతుంది. దీనికి ప్రేరణ చాలా హర్ట్ అయిపోతుంది. ఆమె బిగ్ బాస్ తో మాట్లాడుతూ 'నా పేరు ని చివర్లో పిలవండి బిగ్ బాస్..అప్పుడు నాకు ఎవరినో ఒకరిని ఎంచుకునే అవకాశం వస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 26, 2024 / 08:27 AM IST

    Bigg Boss Telugu 8(46)

    Follow us on

    Bigg Boss Telugu 8: గత వారం టాస్కులలో మగవాళ్ళతో సమానంగా పోటీ పడుతూ ఆడ పులులు అనిపించుకున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది యష్మీ, ప్రేరణ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హోస్ట్ నాగార్జున వీళ్లిద్దరికీ తగిన క్రెడిట్ ఇవ్వలేదు కానీ, ఆ వారం ఆడవాళ్ళలో వీళ్ళు ఆడిన రేంజ్ లో టాస్కులు ఎవ్వరూ ఆడలేదు. మొదటి వారం నుండి వీళ్లిద్దరి మీద సోషల్ మీడియా లో చాలా నెగటివిటీ ఉండేది. కానీ గత వారం వీళ్లిద్దరు తమ ఆట తీరుతో దానిని పాజిటివ్ గా మలుచుకున్నారు. యష్మీ మొదటి వారం లో ప్రేరణ అంటే నాకు అంతగా నచ్చదు, మేము అంత గొప్ప స్నేహితులం కాదు అని అంటుంది. కానీ ఈరోజు యష్మీ స్నేహం కోసం తనకి ఉన్న లగ్జరీ ని కూడా వదులుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిఖిల్ మరియు సీత చీఫ్స్ గా తమ క్లాన్స్ లోకి కంటెస్టెంట్స్ ని తీసుకునే టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్.

    సీత క్లాన్ లోకి నబీల్, విష్ణు ప్రియా, ఆదిత్య ఓం, నైనిక వెళ్ళిపోతారు. ఇక ఆ క్లాన్ లో కేవలం ఒక సబ్యులకు మాత్రమే చోటు ఉన్న సమయం లో యష్మీ ఆ క్లాన్ లోకి వెళ్ళిపోతుంది. దీనికి ప్రేరణ చాలా హర్ట్ అయిపోతుంది. ఆమె బిగ్ బాస్ తో మాట్లాడుతూ ‘నా పేరు ని చివర్లో పిలవండి బిగ్ బాస్..అప్పుడు నాకు ఎవరినో ఒకరిని ఎంచుకునే అవకాశం వస్తుంది. నాకు కాంతారా క్లాన్ లోకి వెళ్లాలని ఉంది’ అని అంటుంది. బిగ్ బాస్ నుండి ఎలాంటి సమాధానం లేకపోవడం తో ‘యష్మీ, ఆదిత్య ఓం మీలో ఎవరైనా ఒకరు ఆ క్లాన్ లోకి వెళ్లిపోవచ్చు కదా’ అని అంటుంది ప్రేరణ. అప్పుడు యష్మీ నేను వెళ్తాను లే, నేను ఏ క్లాన్ లో ఉన్న ఆడేస్తాను అని పైకి లేస్తుంది. అప్పుడు ప్రేరణ నేను ఊరికే అన్నాను లే కూర్చో అని అంటుంది. అలా చర్చలు జరుగుతుండగా ‘నేను వెళ్తాను..పర్వాలేదు అని వెళ్ళిపోతుంది’ యష్మీ. ప్రేరణ కూడా ఇంకా ఏమి మాట్లాడకుండా నైనిక టీం లోకి వెళ్ళిపోతుంది.

    దీంతో కాంతారా టీం లో 6 మంది సభ్యులు ఉండగా, ‘శక్తి’ టీం లో కేవలం 5 మంది మాత్రమే ఉన్నారు. దీంతో బిగ్ బాస్ ‘కాంతారా’ టీం లో ఎక్కువ మంది సభ్యులు ఉన్న కారణంగా ఆ క్లాన్ సబ్యులకు ‘డ్రాగన్ రూమ్’ ని కేటాయిస్తాడు బిగ్ బాస్. డ్రాగన్ రూమ్ లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ప్రేరణ అందుకోసమే ఆ క్లాన్ లోకి వెళ్లాలని కోరుకుంది, అంతే కాకుండా తనకు నిఖిల్ ప్రవర్తన కూడా నచ్చడం లేదు, అందుకే కాంతారా టీం లోకి వెళ్ళింది. కానీ యష్మీ తాను ఎక్కడున్నా నెగ్గుకురాగలను అనే నమ్మకంతో తన శత్రువులు ఉన్న టీం లోకి స్నేహితురాలి కోసం త్యాగం చేసింది.