Haryana: ఇంటి నిర్మాణానికి పునాదులు.. తారసపడిన అద్భుతం

హర్యానాలోని మనే సర్ సమీపంలో బఘంకిలో ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం చేయాలనుకున్నాడు. పునాదులను తవ్వేందుకు జెసిబి ని పురమాయించాడు. గొయ్యి తవ్వుతుండగా కొన్ని పురాతన విగ్రహాలు బయటపడ్డాయి.

Written By: Dharma, Updated On : April 26, 2024 3:24 pm

Haryana

Follow us on

Haryana: ఏదైనా నిర్మాణ పనులు చేస్తున్నప్పుడు పురాతన వస్తువులు బయటపడుతుంటాయి. ఒక్కోసారి అయితే చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూస్తాయి. బంగారంతో పాటు పురాతన విగ్రహాలు కనిపిస్తాయి. ఇటువంటి కథలు ఎన్నో వినిపిస్తుంటాయి. వార్తల్లో నిలుస్తుంటాయి. ఇటీవల ఇటువంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా గొయ్యి తవ్వుతుండగా అరుదైన అద్భుతం ఒకటి కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హర్యానాలోని మనే సర్ సమీపంలో బఘంకిలో ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం చేయాలనుకున్నాడు. పునాదులను తవ్వేందుకు జెసిబి ని పురమాయించాడు. గొయ్యి తవ్వుతుండగా కొన్ని పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. సుమారు నాలుగు శతాబ్దాల కిందట నాటి మూడు కాంస్య విగ్రహాలు బయటపడ్డాయి. కానీ కొంతకాలం గోప్యంగా ఉంచారు. చివరకు పోలీసులకు విషయం తెలియడంతో రంగంలోకి దిగారు. ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటివరకు పనులు నిలిపివేయాలని సంబంధిత యజమానికి ఆదేశించారు.

అయితే ఇక్కడ విగ్రహాలు లభ్యమయ్యాయి అన్న విషయాన్ని సంబంధిత యజమాని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సంబంధిత జెసిబి డ్రైవర్ కు కొంత మొత్తం డబ్బు ముట్టజెప్పాడు. అయితే అదే డ్రైవర్ రెండు రోజుల తర్వాత బిలాస్పూర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంబంధిత యజమాని ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. మూడు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి విష్ణుమూర్తి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, లక్ష్మీదేవి, విష్ణువుల ఉమ్మడి విగ్రహం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే విగ్రహాలతో పాటు బంగారు నాణేల కుండ దొరికిందని ప్రచారం జరుగుతుంది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా విగ్రహాలు లభ్యమైన ప్రాంతంలో గుడి కట్టాలనిగ్రామస్తుల కోరికను పురావస్తు శాఖ అధికారులు తిరస్కరించారు.ఈ విగ్రహాలను అధ్యయనం చేసి.. పురావస్తు శాఖ మ్యూజియంలో పెడతామని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బనాని భట్టాచార్య, డాక్టర్ కుష్ దెబర్ లు తెలిపారు.