Budget Cars : ఇటీవల కార్ల కొనుగోలు పెరుగుతోంది. ప్రతి ఒక్కరు తమకు కారు కావాలని కోరుకుంటున్నారు. దీనికి గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఈఎంఐ పద్ధతిలో కారు కొనుక్కుని తమ కల నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే కారు కొనాలనుకునే కలను నిజం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో కారు కొనాలనుకున్నప్పుడు దానికి తగిన బడ్జెట్ వేసుకుంటున్నారు. ఆ బడ్జెట్ లోనే కారు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి గాను పలు కంపెనీల ఆఫర్లు పరిశీలిస్తున్నారు.
మనం కొనాలనుకునే కారు మన బడ్జెట్ లో వస్తుందో లేదో చూసుకుంటాం. మనకు సరసమైన ధరల్లో లభించే ఐదు కార్ల గురించి తెలుసుకుందాం. మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, రెనో వంటి కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకీ ఎంట్రీ లెవల్ కారు ఆల్టో కే 10 లో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ రివర్స్ పార్కింగ్ సెన్సార్, యాంటీ బాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్మార్ట్ ఫ్రీ స్టూడియో ఇన్నోటైన్ మెంట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండటం గమనార్హం.
మారుతి సుజుకి ఆల్టో 10 కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.4 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇందులో సీఎన్ జీ వేరియంట్ ధర రూ. 5.9 లక్షలుగా ఉంది. ఇది 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇక హ్యుందాయ్ ఐ20 నియోన్ మోడల్ కూడా తక్కువ బడ్జెట్ లోనే రానుంది. ఇందులో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఇన్నోటైన్ మెంట్ వైర్ లెస్ చార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఈఎస్ సీ ఫైజర్ మానిటరింగ్ సిస్టమ్ లు ఉన్నాయి. దీని ధర రూ. 5.73 లక్షలుగా ఉంది.
రెనో క్విడ్ కారులో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 1000 సీసీ ఇంజిన్ ఉంది. రివర్స్ పార్కింగ్ ,సెన్సార్ డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏజీఎన్ ఈజీడీ ఫీల్డ్ వైల్డ్ రిమైండర్, ఓనర్ స్పీడ్ అలర్ట్ ఇలా చాలా ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 4.7 లక్షలు. ఇది లీటర్ కు 23 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మారుతి సుజుకి సెలెరియో మోడల్ కూడా మంచి ఫీచర్లు కలిగి ఉంది.
ఇందులో డ్యూయల్ జెట్ ఇంజిన్ ఉంది. ఇంజిన్ స్మార్ట్ స్టార్ట్ బటన్, లార్డ్ ఇన్నో టైన్ మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, సీజీఎన్ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 5.15 లక్షలుగా ఉంది. ఇది 27 కిలోమీటర్లు ఇస్తుంది. ఇక టాటా టియాగో కూడా తక్కువ ధరలోనే దక్కుతుంది. దీని ధర రూ. 5.5 లక్షలు. ఇందులో కూడా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏజీఎన్ ఈబీడీ సీఎస్ సీ వంటివి ఉన్నాయి.