
Balagam Actor Kota Jayaram: దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నా రాని గుర్తింపు ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. బలగం మూవీ నటుల జీవితాలు మారిపోయాయి. వాళ్లకు భవిష్యత్ లో ఆఫర్స్ వస్తాయా రావా? అనే విషయం పక్కన పెడితే పేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు. ఫలానా వ్యక్తి ఒక నటుడు అనే గుర్తింపు పొందారు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో నటించినా ఇంత పేరు రాదు. కారణం ఈ సినిమాలో వీళ్ళే హీరోలు. బలగం నటుల్లో తెలిసిన ముఖాలు రెండే రెండు. ఒకటి ప్రియదర్శి రెండు కావ్యా కళ్యాణ్ రామ్. హీరోయిన్ కావ్య గురించి కూడా తెలిసింది తక్కువే. ఆమెకు హీరోయిన్ గా ఇది కేవలం రెండో చిత్రం.
ఈ మూవీలో ప్రధాన పాత్రలు కొమురయ్య, ఐలయ్య, నారాయణ, లక్ష్మి. ఈ రోల్స్ చేసిన నటుల గురించి గతంలో తెలియదు. బలగం మూవీలో మెప్పించిన పాత్రల్లో ఐలయ్య ఒకటి. కొమురయ్య కొడుకు, సాయిలు తండ్రి అయిన ఐలయ్య పాత్రను కోటా జయరాం అనే నటుడు చేశారు. సినిమాలో కోటా జయరాం నటన చాలా సహజంగా ఉంటుంది. పతాక సన్నివేశాల్లో అయితే ఏడిపించేశాడు. కేవలం కళ్ళతో నటించాడు.

కోటా జయరాం తాజా ఇంటర్వ్యూలో బలగం మూవీతో పాటు తన కెరీర్లో ఎదురైన ఒడిదుడుకులు, అవమానాలును ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్ చేశాడు. కోటా జయరాం 40 కి పైగా సీరియల్స్ లో నటించారట. ఆయన ఎక్కువగా పోలీసు పాత్రలు వేశారట. సినిమా అంటే చిన్న పాత్ర చేయడానికి కూడా ముందుకు వచ్చేవాడట. అలా పలు చిత్రాల్లో నటించాడట. ఓ మూవీ షూటింగ్ లో ఘోర అవమానం జరిగిందట.
బాగా నటిస్తున్నాడు కెమెరా ఆయన మీద పెడదాం అని కెమెరా మెన్ అన్నాడట. దానికి కో డైరెక్టర్ వద్దు ఆ కుక్క మీద పెట్టు అన్నాడట. కుక్కకు ఉన్న విలువ కూడా ఆర్టిస్ట్ కి లేదని జయరాం బాధపడ్డాడట. ఆ కో డైరెక్టర్ కనిపిస్తే మాట్లాడతాడట. నువ్వు మంచి నటుడువని అంటాడట. ఆయన మీద నాకు కోపం లేదు. ఆ సమయంలో కొంచెం బాధేసిందని కోటా జయరాం చెప్పారు. ఇక తన ఫ్రెండ్ చేయను అనడంతో బలగం మూవీ ఆఫర్ తనకు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.