https://oktelugu.com/

Best Cars Under 7 Lakhs: రూ.7 లక్షల ధరల్లో బెస్ట్ పీచర్స్ కలిగి ఉన్న ఈ కార్ల గురించి తెలుసా?

మారుతి వ్యాగన్ ఆర్ అమ్మకాల్లో నెంబర్ 1 గా నిలిచింది. కారు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో 1.0 లీటర్, 1.2 లీటర్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 5, 2023 / 01:14 PM IST
    Follow us on

    Best Cars Under 7 Lakhs: కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త మోడళ్లు పుట్టుకొస్తున్నాయి. అయితే SUVలు ప్రిఫరెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు వాటి ఉత్పత్తికే మొగ్గుచూపుతున్నాయి. కానీ మారుతి లాంటి కంపెనీలు మాత్రం హ్యాచ్ బ్యాక్ కార్లనే నమ్ముకుంది. వీటికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుందని వాటి అమ్మకానుల చూస్తే తెలుస్తోది. మారుతి నుంచి రిలీజైన వ్యాగన్ ఆర్ మోడల్ అందుకు నిరద్శనం. ఈ మోడల్ SUV కార్లను దాటుకుంటూ ముందుకు వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగింది. ఈ నేపథ్యంలో వ్యాగన్ ఆర్ తో పాటు ఎక్కువగా అమ్ముడవుతున్న మరికొన్ని కార్ల గురించి తెలుసుకుందాం.

    మారుతి Wagan R:
    మారుతి వ్యాగన్ ఆర్ అమ్మకాల్లో నెంబర్ 1 గా నిలిచింది. కారు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో 1.0 లీటర్, 1.2 లీటర్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్, విలక్షణమైన బాక్సీ డిజైన్ వ్యాగన్ ఆర్ సొంతం. దీని ధర విషయానికొస్తే రూ.5.54 లక్షల నుంచి రూ.7.42 వరకు విక్రయిస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో వ్యాగన్ ఆర్ 20,879 యూనిట్లు అమ్మడం విశేషం.

    మారుతి Swift:
    మారుతి సుజుకీ కంపెనీ నుంచి రెండో బెస్ట్ కారుగా నిలిచింది స్విఫ్ట్. భారత్ వినియోగదారులు స్విఫ్ట్ ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలిగిన స్విఫ్ట్ 90 పీఎస్ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. దీని ధర రూ.6.00 లక్షల నుంచి రూ.9.00 లక్షల వరకు ఉంది. ఏప్రిల్ లో ఈ మోడల్ ను 18,573 యూనిట్లు విక్రయించారు.

    బాలెనో:
    దేశీయ మార్కెట్లలో ఏకైక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు మారుతి బాలెనో. 1.2 లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 12 మైల్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు 89 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ తో పాటు సీఎన్ జీ వేరియంట్లలో కూడా ఇది లభిస్తుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర రూ.6.61 లక్షల నుంచి రూ.9.88 వరకు విక్రయిస్తున్నారు. ఈ మోడల్ ఏప్రిల్ ఒక్క నెలలో 16,180 యూనిట్లను విక్రయించారు.