https://oktelugu.com/

6 sales in 6 months: ఆరు నెలల్లో 6 మాత్రమే విక్రయాలు జరుపుకున్న కారు ఏదో తెలుసా?

కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. కార్ల కంపెనీలు సైతం వినియోగదారులను ఆకర్షించే విధంగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అప్డేట్ ఫీచర్లు, టెక్నాలజీతో కూడిన కొత్త వెహికల్స్ మార్కెట్లోకి రావడంతో కొందరు వినియోగదారులు పాత కార్ల స్థానంలో కొత్తవాటిని చేర్చుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 15, 2024 / 11:52 AM IST

    car that has only 6 sales in 6 months

    Follow us on

    6 sales in 6 months: కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. కార్ల కంపెనీలు సైతం వినియోగదారులను ఆకర్షించే విధంగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అప్డేట్ ఫీచర్లు, టెక్నాలజీతో కూడిన కొత్త వెహికల్స్ మార్కెట్లోకి రావడంతో కొందరు వినియోగదారులు పాత కార్ల స్థానంలో కొత్తవాటిని చేర్చుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు లాభాల బాటలో వెళ్తున్నారు. అయితే ఓ కంపెనీకి చెందిన కారు డిజస్టర్ గా మిగిలింది. ఆ కంపెనీకి చెందిన కారు చెత్త సేల్స్ గా పేరు తెచ్చుకుంది. గత ఆరు నెలల్లలో కేవలం 6 కార్లు మాత్రమే అమ్ముడు పోయాయాంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

    భారత్ ఆటోమోబైల్ మార్కెట్లో కార్ల సేల్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో దేశీయ కంపెనీలే కాకుండా విదేశీ కంపెనీలు సైతం ఇక్కడ తమ ప్రొడక్ట్ ను పరిచయం చేస్తుంటాయి. ఫ్రెంచ్ దేశానికి చెందిన కంపెనీ సిట్రోయిన్ కార్లు భారత మార్కెట్లోకి ఇప్పటికే వచ్చాయి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా సీ 3, ఎయిర్ క్రాస్, ఈసీ3 కార్లు గుర్తింపు పొందారు. ఇటీవల కొత్తగా బసాల్ట్ ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. కొత్తగా రిలీజ్ అయిన ఈ కారు సేల్స్ మొల్లగా పుంజుకుంటున్నాయి. అంతేకాకుండా సిట్రోయిన్ కంపెనీకి ప్రముఖ క్రికెటర్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడంతో ఈ కంపెనీ కార్లకు ప్రాధాన్యత పెరిగింది.

    అయితే ఈ కంపెనీకి చెందిన ఓ కారును మాత్రం వినియోగదారులు పట్టించుకోవడం లేదు. కనీసం షో రూంలో ఉంచిన కార్లుసైతం అమ్ముడుపోవడం లేదంటే ఆశ్చర్యం కాదు. ఆ కారు ఏదో కాదు.. సిట్రియోన్ సీ 5 ఎయిర్ క్రాస్. ఈ కంపెనీ నుంచి వివిధ కార్లు ఎక్కువ సేల్స్ నమోదు చేసుకుంటున్నప్పటికీ సిట్రియోన్ సీ 5 మాత్రం షోరూంలోనే ఉండిపోతుంది. ఈ కారు 2021లో మార్కెట్లోకి వచ్చింది. కానీ అప్పటి నుంచి దీనిని కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. గత ఆరు నెలల్లో దీనిని కేవలం 6గురు మాత్రమే కొనుగోలు చేశారు.

    ఈ కారు సేల్స్ తక్కువ కాకపోవడానికి కారణమేంటో తెలియడం లేదు. కానీ ఇందులో ఉండే ఫీచర్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 127 బీహెచ్ పీ పవర్ తో 400 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎల్ ఈడీ ప్రొటెక్టర్, హెడ్ లైట్స్, 3డీ ఎల్ ఈడీ రిలయ్ టైల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేప్టీ విషయంలోనూ మంచి ఫీచర్సే ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వంటివి ఆకర్షిస్తున్నాయి. లగ్జరీ కార్లతో పోటీ పడేందుకు మార్కెట్లోకి వచ్చిన దీని ధర రూ.36 లక్షలుగా ఉంది. ఇది లీటర్ పెట్రోల్ కు 17.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.