Homeఎంటర్టైన్మెంట్Daaku Maharaaj Teaser: డాకు మహారాజ్ టీజర్ రివ్యూ: రాజ్యం లేకుండా యుద్ధం చేసే రాజు...

Daaku Maharaaj Teaser: డాకు మహారాజ్ టీజర్ రివ్యూ: రాజ్యం లేకుండా యుద్ధం చేసే రాజు కథ, మైండ్ బ్లాక్ చేసిన బాలయ్య!

Daaku Maharaaj Teaser: అఖండ మూవీతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు బాలకృష్ణ. అనంతరం వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. బాలకృష్ణ తన 109వ చిత్రం వాల్తేరు వీరయ్య ఫేమ్ దర్శకుడు బాబీ కొల్లి తో చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 109 వర్కింగ్ టైటిల్ గా ఉన్న ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ విడుదల చేశారు. చాలా పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. డాకు మహారాజ్ గా సిల్వర్ స్క్రీన్ ని బాలకృష్ణ దున్నేయనున్నాడు.

”ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది” అనే ఇంటెన్స్ వాయిస్ ఓవర్ తో డాకు మహారాజ్ టీజర్ మొదలైంది. గుర్తు పట్టలేదా.. డాకు మహారాజ్ అని బాలయ్య డైలాగ్ చెప్పడం గూస్ బంప్స్ రేపింది.

పీరియాడిక్ స్టోరీ అని తెలుస్తుండగా అందుకు తగ్గట్లు టైటిల్ ఎంచుకున్నారు. బాలకృష్ణ లుక్ అండ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయి. ఆయన బంధిపోటు లేదా గూఢచారి కావచ్చు. అజ్ఞాతంలో ఉండి దుర్మార్గుల మీద యుద్ధం చేసే వీరుడు కావచ్చు. టీజర్ తో స్పష్టత అయితే రాలేదు. బహుశా ఆయన రాజ్యాన్ని వీడి పోరాటం చేస్తున్న రాజు కూడా కావచ్చు. విజువల్స్ అబ్బురపరిచాయి.

థమన్ బీజీఎమ్ ఆకట్టుకుంది. మొత్తంగా డాకు మహారాజ్ టీజర్ అంచనాలు పెంచేసింది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న డాకు మహారాజ్ విడుదల కానుంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాధ్, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టీజర్ ఆకట్టుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం అనంతరం బాలకృష్ణ దర్శకుడు బోయపాటితో అఖండ 2 చేస్తున్నారు.

 

Daaku Maharaaj Teaser | Nandamuri Balakrishna | Bobby Kolli | Thaman S | S Naga Vamsi

Exit mobile version