https://oktelugu.com/

Equity Funds : ఈ ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారా? డబులు రిటర్న్స్ మీ సొంతం..

132 శాతం రిటర్న్స్ ఇస్తుంది మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఇందులో 2.32 లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు. హెచ్ డీఎఫ్ సీ స్మాల్ క్యాప్ ఫండ్ లో కూడా 127 శాతం రిటర్న్స్ వస్తాయి. దీనిలో కూడా 2.26 లక్షల రిటర్న్స్ వస్తాయి.

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 3:33 pm

    equity-funds

    Follow us on

    Equity Funds : ప్రతి ఒక్కరు డబ్బును ఆదాయ చేయాలి అనుకుంటారు. కానీ ఎలా చేయాలి? ఎంత చేయాలి? అని సతమతమవుతుంటారు. అయితే రిస్క్ లేకుండా బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ అని కొందరు అంటే.. రిస్క్ ఉంటేనే లైఫ్ లో కిక్ అని కొందరు ఈక్విటీల్లో, ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే సుమారు 36 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు రెట్టింపు అవుతున్నాయట. మరి అందులో టాప్ లో ఉన్న కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏంటో తెలుసుకుందాం.

    క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్.. ఇందులో పెట్టుబడి పెడితే మూడు సంవత్సరాలలో 196 శాతం రిటర్న్స్ వస్తాయి. ఇందులో కేవలం లక్ష పెట్టుబడి పెడితే చాలు మూడు సంవత్సరాలలో ఏకంగా రూ. 2,95 లక్షలు తిరిగి వస్తాయి. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్: ఇందులో పెట్టుబడి పెడితే మూడు సంవత్సరాలలో ఏకంగా 158 శాతం రిటర్న్స్ వస్తాయి. అంటే లక్ష పొదుపు చేస్తే మూడు సంవత్సరాలలో 2.58 లక్షలు అవుతాయి. క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్: ఇందులో పెట్టుబడి పెడితే మూడు సంవత్సరాలలో 2.43 లక్షలు రిటర్న్స్ వస్తాయి.

    నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే 143 శాతం డబ్బులు వస్తాయి. అంటే మీరు లక్ష పెట్టుబడి పెడితే ఏకంగా మూడు సంవత్సరాలలో రూ. 2.43 లక్షలు పొందవచ్చు. హెచ్ఎస్ బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ లో అయితే 138 శాతం వస్తాయి. దీనికి రూ. 2.38 లక్షలు పొందవచ్చు. క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే 134 శాతం రిటర్న్ వస్తాయి. దీనిలో కూడా లక్ష పెట్టుబడి పెడితే 2.33 లక్షల లాభం పొందవచ్చు.

    132 శాతం రిటర్న్స్ ఇస్తుంది మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఇందులో 2.32 లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు. హెచ్ డీఎఫ్ సీ స్మాల్ క్యాప్ ఫండ్ లో కూడా 127 శాతం రిటర్న్స్ వస్తాయి. దీనిలో కూడా 2.26 లక్షల రిటర్న్స్ వస్తాయి. 125 శాతం రిటర్న్స్ రావాలి అంటే క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిలో లక్షకు 2.25 తిరిగి వస్తాయి. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ కోస్ ఫండ్ లో అయితే 122 శాతం వస్తాయి. అంటే 2.21 లక్షల రిటర్న్స్ వస్తాయి కాబట్టి మీరు ఈ పైన తెలిపిన వాటిలో ఎందులో అయినా పెట్టుబడి పెట్టవచ్చు.