దేశంలో క్రెడిట్ కార్డులు వినియోగించే వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంది. రోజురోజుకు క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు సులభంగానే క్రెడిట్ కార్డులు మంజూరవుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డు వినియోగించేవాళ్లు సమయానికి క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లిస్తే మాత్రమే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేసినా , బిల్లులను చెల్లించకపోయినా ఆ ప్రభావం సిబిల్ స్కోర్ పై పడుతుంది. ఏదైనా లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ను బట్టి లోన్ ను మంజూరు చేయడం జరుగుతుంది. అయితే సిబిల్ స్కోర్ తగ్గినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం సులభంగా లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అనే సంస్థ సిబిల్ స్కోర్ ను లెక్కించడం జరుగుతుంది.
550 కంటే ఎక్కువగా సిబిల్ స్కోర్ ఉంటే మాత్రమే సులభంగా రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అంతకంటే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా రుణం మంజూరవుతుంది కానీ వడ్డీరేటు సాధారణ వడ్డీరేటుతో పోల్చి చూస్తే ఎక్కువగా ఉంటుంది. అన్ సెక్యూర్డ్ రుణాలను పొందే విషయంలో సిబిల్ స్కోర్ కీలక పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. కొన్ని ఫిన్ టెక్ సంస్థలు మాత్రం సిబిల్ స్కోర్ ను పట్టించుకోకుండా 50,000 రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తున్నాయి.
సిబిల్ స్కోర్ లేకపోయినా రుణం పొందాలంటే బంగారం లేదా ఆస్తులను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. తక్కువ మొత్తంలో రుణం తీసుకుని చెల్లించడం ద్వారా సిబిల్ స్కోర్ పెరుగుతుంది.