Director Maruthi: ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు మారుతి. చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి… ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేమ కధ చిత్రం లో మంచి హిట్ అందుకున్న మారుతి ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజు పండగే’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే ఇప్పటి వరకు స్టార్ హీరోలతో మారుతి సినిమాను తెరకెక్కించలేదు. కానీ ఈసారి మాత్రం ఒకే సారి మెగాస్టార్ ను డైరెక్ట్ చేయబోయే ఛాన్స్ దక్కించుకున్నాడని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.

గతంలో మెగాస్టార్ చిరంజీవి త్వరలో మారుతితో ఒక సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కాగా చిరు ఇటీవల ప్రకటించిన సినిమాలల్లో వేరే దర్శకులు ఉన్నారు తప్ప… మారుతితో సినిమా చేయనున్నట్లు చెప్పలేదు. దీంతో వి కాంబోలో సినిమా ఆగిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు మారుతి. ఇటీవల చిరంజీవి గారిని కలిసి ఓ లైన్ చెప్పానని… ఆయనకు బాగా నచ్చిందని అన్నారు. ఇప్పుడు దాన్ని డెవలప్ చేసే పనిలో పడ్డానని… తన మార్క్ కామెడీతో పాటు, చిరు ఫ్యాన్స్ ఆశించే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దం కానుంది. మరో వైపు లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు చిరు. ఈ సినిమాలతో పాటు మెహర్ రమేష్ డైరెక్షన్ లో “భోళా శంకర్”… డైరెక్టర్ బాబీతో వాల్తేరు వాసు చిత్రాలు చేస్తున్నారు. ఆ తరువాత మారుతికి ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నారు. కాగా ఈరోజు మారుతి దర్శకత్వం వహించిన మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదలయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అలానే గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు.