https://oktelugu.com/

Anant Ambani Pre-wedding : వామ్మో ముఖేష్ అంబానీ సింగర్ కు అంత రెమ్యూనరేషన్ ఇచ్చాడా?

ఈ సింగర్ అనంత అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి వేడుకలలో భాగంగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ఏకంగా రూ. 75 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతుందట. ఇలా ఒక సింగర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇదే మొదటి సారి అంటూ కామెంట్లు చేస్తున్నారు

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 / 12:10 PM IST
    Follow us on

    Anant Ambani Pre-wedding ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో అపర కుభేరుడిగా పేరు సంపాదించారు ఈయన. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు జామ్ నగర్ లో గత మూడు రోజుల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఈ పెళ్లి వేడుకల కోసం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ సెలబ్రెటీలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ పెళ్లి వేడుకలలో పాల్గొనబోతున్నారు. గత మూడు రోజుల నుంచి ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

    ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు ప్రముఖ క్రికెటర్లు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖ సింగర్ రిహన్నా అద్భుతమైనటువంటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈమెతో కలిసి సెలబ్రెటీలు కూడా ఆడిపాడి సందడి చేస్తున్నారు. ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

    అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా ఈమె స్టేజ్ ఫర్మార్మెన్స్ ఇచ్చారు. ఇలా వేదికపై ఈమె పాటలకు సెలబ్రెటీలు సైతం ఊగిపోయి డాన్స్ చేస్తున్నారు. అంతేకాదు అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఆమెతో కలిసి వేదికపై డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇలా హాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్ ను ఇక్కడికి పిలిపించడంతో ఈమెకు ఎంత మొత్తంలో అంబానీ ఫ్యామిలీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

    ఈ సింగర్ అనంత అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి వేడుకలలో భాగంగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ఏకంగా రూ. 75 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతుందట. ఇలా ఒక సింగర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇదే మొదటి సారి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడే అంబానీ మార్క్ ఏంటో కనబడుతుంది అంటున్నారు కొందరు. అయితే మన సింగర్స్ సంవత్సరం మొత్తం కష్టపడ్డా కూడా ఈ రేంజ్ లో డబ్బు సంపాదించడం కష్టమే అంటున్నారు నెటిజన్లు.