https://oktelugu.com/

వాళ్లకు రూ.5 లక్షలు ఇస్తున్న కేంద్రం.. ఎలా పొందాలంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొనిరాగా ఈ ఆఫర్ ద్వారా ఏకంగా 5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. మొదటి విజేత 5 లక్షల రూపాయలు గెలుపొందనుండగా రెండో విజేత 2.5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గ్రాండ్ వాటర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 29, 2021 / 03:30 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొనిరాగా ఈ ఆఫర్ ద్వారా ఏకంగా 5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. మొదటి విజేత 5 లక్షల రూపాయలు గెలుపొందనుండగా రెండో విజేత 2.5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గ్రాండ్ వాటర్ సేవింగ్ ఛాలెంజ్ పేరుతో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మద్దతుగా ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఎవరైతే ఈ ఛాలెంజ్ లో పాల్గొని విన్ అవుతారో వాళ్లు డబ్బులు గెలుపొందే అవకాశం ఉంటుంది. మరుగుదొడ్ల కోసం ఒక వినూత్న ఫ్లష్ వ్యవస్థను అభివృద్ధి చేసి వాటర్ సేవింగ్ చేసే ఫ్లష్ వ్యవస్థను ఎవరైతే రూపొందిస్తారో వాళ్లు ఈ పోటీలో గెలుపొందుతారు.

    కేంద్ర ప్రభుత్వం కేవలం ఇద్దరికి మాత్రమే ఈ స్కీమ్ కింద ప్రైజ్ మనీని అందిస్తుంది. పారిశుధ్యం, పరిశుభ్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ వినూత్న ఫ్లష్ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. జూన్ 25వ తేదీ ఈ పోటీలో పాల్గొనడానికి చివరితేదీగా ఉంది. https://www.startupindia.gov.in/content/sih/en/ams-application/challenge.html?applicationid=6050cc03e4b03f92cbc8c95e లింక్ ద్వారా ఈ ఛాలెంజ్ కొసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    కరోనా వల్ల ప్రజల్లో ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటునన్ నేపథ్యంలో ఈ ఛాలెంజ్ లో గెలుపొందడం ద్వారా సులభంగా డబ్బులను గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది.