https://oktelugu.com/

Bharateeyudu 2: భారతీయుడు 2 మూవీ ప్రీ రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా రానున్న స్టార్ హీరో…

Bharateeyudu 2: ఈనెల ఏడోవ తేదీన భారతీయుడు 2 ప్రి రిలీజ్ ఈవెంట్ ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అనే విషయం మీద పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : July 6, 2024 / 04:01 PM IST

    Chiranjeevi as chief guest for Bharateeyudu 2 movie pre-release event

    Follow us on

    Bharateeyudu 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అగ్రగామి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో కమలహాసన్… ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈనెల 12 వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హాసన్ ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక అందులో భాగంగానే తెలుగులో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.

    ఇక అందులో భాగంగానే ఈనెల ఏడోవ తేదీన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అనే విషయం మీద పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కమలహాసన్ కి చిరంజీవికి మధ్య మంచి సన్నిహిత్యం ఉండటం వల్ల చిరంజీవి ఈవెంట్ కి హాజరవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే శంకర్ చిరంజీవి మధ్య కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది.

    ఇక ఈవెంట్ కి తను హాజరై ఈ సినిమా మీద మరింత అంచనాలు పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక 28 సంవత్సరాల కిందట వచ్చిన భారతీయుడు సినిమాకి ఇప్పుడు సిక్వెల్ గా ‘భారతీయుడు 2 ‘ సినిమా రావడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. మరోసారి కమల్ హాసన్ సేనాపతి క్యారెక్టర్ లో అదరగొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…

    ఇక ఈ సినిమాతో భారీ హిట్టు కొట్టడం పక్క అంటూ శంకర్ ఇప్పటికే భారీ కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉండటం తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి… చూడాలి మరి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…