spot_img
Homeబిజినెస్Satya Nadella: సత్య నాదెళ్లకు షాకిచ్చిన కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ.. కారణం ఇదే

Satya Nadella: సత్య నాదెళ్లకు షాకిచ్చిన కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ.. కారణం ఇదే

Satya Nadella: మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ సత్య నాదెళ్లకు, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్‌ఇన్‌ ఇండియాలతోపాటు ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ షాక్‌ ఇచ్చింది. కంపెనీల చట్టం 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్‌ ఓనర్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు లింక్డ్‌ఇన్‌ ఇండయిఆ, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్‌ రిస్లోన్సీ్కతోపహా పలువురు కీలకమైన వ్యక్తులకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది. ఈమేరకు 63 పేజీల ఆర్డర్‌ను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై రీజనల్‌ డైరెక్టర్‌కు 60 రోజుల్లో అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

వివరాలు దాచారని అభియోగం..
లింక్డ్‌ఇన్‌ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్‌బీవో రిపోర్టింగ్‌ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పేర్కొంది. ప్రత్యేకించి చట్టంలోని సెక్షన్‌ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్‌ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లిక్డ్‌న్‌ కార్పొరేషన్‌ సీఈవో ర్యాన్‌ రోస్లాన్స్క్‌ నివేదించలేదుని పేర్కొంది.

ఆర్‌వోసీ ప్రకారం..
రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్‌వోసీ) ప్రకారం లింక్డ్‌న్‌ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(లింక్డ్‌ఇన్‌ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్కాన్స్క్‌తోపాటు మరో ఏడుగురు వ్యక్తులకు మొత్తం రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్‌ఇన్‌ ఇండియాకు రూ.7 లక్షలు, సత్యనాదెళ్ల, రోస్లాన్స్క్‌ ఒక్కొక్కరికి రూ.2 లోల చొప్పున జరిమానా విధించింది. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్‌ రేంజర్‌ డాలివర్, బెంజిమిన్‌ ఓపెన్‌ ఓర్న్‌డార్ఫ్, మిచెల్‌ కాట్టిలెంగ్, లిసా ఎమికో సాటో, ఆశుతోష్‌ గుప్తా, మార్క్‌ లియోనార్డ్‌ నాడ్రెస్‌ లెగాస్సీ, హెన్రీ చినింగ్‌ ఫాంగ్‌ ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper