Satya Nadella: మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్లకు, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్‌ఇన్ ఇండియాలతోపాటు ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. కంపెనీల చట్టం 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు లింక్డ్‌ఇన్ ఇండయిఆ, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రిస్లోన్సీ్కతోపహా పలువురు కీలకమైన వ్యక్తులకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది. ఈమేరకు 63 పేజీల ఆర్డర్‌ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై రీజనల్ డైరెక్టర్‌కు 60 రోజుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది.
వివరాలు దాచారని అభియోగం..
లింక్డ్‌ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్‌బీవో రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ పేర్కొంది. ప్రత్యేకించి చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లిక్డ్‌న్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్క్ నివేదించలేదుని పేర్కొంది.
ఆర్‌వోసీ ప్రకారం..
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్‌వోసీ) ప్రకారం లింక్డ్‌న్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్(లింక్డ్‌ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్కాన్స్క్‌తోపాటు మరో ఏడుగురు వ్యక్తులకు మొత్తం రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్‌ఇన్ ఇండియాకు రూ.7 లక్షలు, సత్యనాదెళ్ల, రోస్లాన్స్క్ ఒక్కొక్కరికి రూ.2 లోల చొప్పున జరిమానా విధించింది. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజిమిన్ ఓపెన్ ఓర్న్‌డార్ఫ్, మిచెల్ కాట్టిలెంగ్, లిసా ఎమికో సాటో, ఆశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్సీ, హెన్రీ చినింగ్ ఫాంగ్ ఉన్నారు.