Pearl Cultivation: ముత్యాల సాగుతో లక్షల్లో సంపాదిస్తున్న రైతు.. ఎలా అంటే?

Pearl Cultivation: ప్రకృతి నుంచి సహజంగా లభించే వాటిలో ముత్యాలు ఒకటనే సంగతి తెలిసిందే. ముత్యాలతో చేసిన వస్తువులను ధరించడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అయితే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన సంజయ్ మాత్రం ప్రకృతిసిద్ధమైన మేలి ముత్యాలను పెంచుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సంజయ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలలో ఫెయిల్ అయ్యారు. గడిచిన 7 సంవత్సరాలుగా సంజయ్ ముత్యాల సాగు చేస్తుండగా […]

Written By: Kusuma Aggunna, Updated On : August 20, 2021 3:55 pm
Follow us on

Pearl Cultivation: ప్రకృతి నుంచి సహజంగా లభించే వాటిలో ముత్యాలు ఒకటనే సంగతి తెలిసిందే. ముత్యాలతో చేసిన వస్తువులను ధరించడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అయితే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన సంజయ్ మాత్రం ప్రకృతిసిద్ధమైన మేలి ముత్యాలను పెంచుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సంజయ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలలో ఫెయిల్ అయ్యారు.

గడిచిన 7 సంవత్సరాలుగా సంజయ్ ముత్యాల సాగు చేస్తుండగా ఈ ముత్యాలకు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ నెలకొంది. ముత్యాల సాగు ద్వారా సంజయ్ ఏకంగా సంవత్సరానికి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయంకు భిన్నంగా చేయాలని అనుకున్న సంజయ్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం ద్వారా ముత్యాలను ఆల్చిప్పల నుంచి తయారు చేయవచ్చనే విషయం తెలుసుకున్నారు.

ఆ తర్వాత సరస్సును అద్దెకు తీసుకుని సంజయ్ వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు. మొదట్లో నష్టం వచ్చినా మళ్లీ ముత్యాల పెంపకాన్ని ప్రారంభించాడు. సంజయ్ సోషల్ మీడియా ద్వారా ముత్యాలను మార్కెటింగ్ చేస్తుండటం గమనార్హం. క్యారెట్‌కు రూ .1200 చొప్పున సంజయ్ ముత్యాలను విక్రయిస్తున్నాడు. సంజయ్ ముత్యాల పెంపకం విషయంలో ఇతరులకు కూడా శిక్షణ ఇస్తున్నాడు.

ఎవరైనా ముత్యాల పెంపకం శిక్షణను తీసుకోవాలంటే ఆరువేల రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న ఎంతోమంది యువరైతులు అతని దగ్గరకు వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు సంజయ్ 1,000 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది.