https://oktelugu.com/

Prabhas Salaar: ప్రభాస్ ‘సలార్’లో విలన్ ఇతడే!

‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా మూవీలే చేస్తూ అలరిస్తున్నాడు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ పూర్తికాగా.. ‘ఆదిపురుష్’, సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఒకే సారి మూడు సినిమాల్లో చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సలార్’ మూవీ ఫుల్ యాక్షన్ మూవీ. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ మూవీ అంతకుమించిన కథ, […]

Written By:
  • NARESH
  • , Updated On : August 20, 2021 / 03:59 PM IST
    Follow us on

    ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా మూవీలే చేస్తూ అలరిస్తున్నాడు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ పూర్తికాగా.. ‘ఆదిపురుష్’, సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఒకే సారి మూడు సినిమాల్లో చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు ప్రభాస్.

    ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సలార్’ మూవీ ఫుల్ యాక్షన్ మూవీ. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ మూవీ అంతకుమించిన కథ, యాక్షన్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు.

    ఈ క్రమంలోనే ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ తో ఢీకొట్టే విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, సౌత్ హీరో విజయ్ సేతుపతిల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్టేట్ తాజాగా వెలువడింది.

    ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు , ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ హీరో మనోజ్ బాజ్ పాయ్ ను సలార్ లో విలన్ గా తీసుకున్నట్టు టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే ఓ భారీ సెట్ వేశారట.. త్వరలోనే విలన్ మనోజ్ బాజ్ పాయ్ పై వచ్చే సీన్లను షూట్ చేసేందుకు రెడీ అయ్యారట..

    ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు మనోజ్ బాజ్ పాయ్ సుపరిచితుడే.. ‘హ్యాపీ’, కొమురం పులి చిత్రాల్లో మనోజ్ నటించాడు. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ 2తో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీని కేజీఎఫ్2ను మించి తీసేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

    1970 ఇండియా-పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు.