Croma Offers: 2026 కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మంది కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా చాలామంది కొత్త వస్తువులను కొనుగోలు చేశారు. అయితే వచ్చే రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ప్రత్యేకమైన వస్తువులను సొంతం చేసుకోవాలని అనుకుంటారు. దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రముఖ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. వాటిలో భాగంగా Croma అనే కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ తగ్గింపును ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు ఉన్న స్టోర్లలో ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని అధికారికంగా ప్రకటించింది. జనవరి 26 వరకు మాత్రమే ఉండే ఈ ఆఫర్లలో ఐఫోన్ కూడా ఉండడం విశేషం. మరి ఏ వస్తువుపై ఎంత ధర తగ్గింపు ఉందో ఇప్పుడు చూద్దాం..
ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని అనుకునే వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రోమా కంపెనీ భారీ ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈ సంస్థ నుంచి ఆపిల్ ఫోన్ కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపును ఇవ్వనుంది. ఐఫోన్ 15 మార్కెట్లో రూ.59,900 విక్రయిస్తున్నారు. దీనిపై రూ.23,500 ఎక్స్చేంజి ఆఫర్ ను. అలాగే రూ.2,000 ఫ్లాట్ బ్యాంకు క్యాష్ బ్యాక్, అదనంగా రూ.8,000 ఎక్స్చేంజి బోనస్ ఇవ్వనుంది. మొత్తంగా ఈ మొబైల్ ను రూ.31,990 కె విక్రయించే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి మరిన్ని ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా ఒకేసారి మొత్తాన్ని చెల్లించకుండా EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ముఖ్యంగా HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి పది శాతం వరకు తగ్గింపు ఉండే అవకాశాలు ఉన్నాయి.
క్రోమా సంస్థ కేవలం ఆపిల్ ఫోన్ లపై మాత్రమే కాకుండా మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లపై కూడా తగ్గింపు ధరలు ప్రకటించింది. వీటిలో భాగంగా Samsung కంపెనీకి చెందిన గెలాక్సీ S24 మొబైల్ ను రూ.50,499 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే S 24 అల్ట్రా మొబైల్ రూ.79,999 కు అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా నాకు బుక్ ఎయిర్ M4 రూ.55,911 ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనిపై కూడా క్యాష్బూక్ వర్తించే అవకాశం ఉంది. ఇవే కాకుండా గృహోపకరణాలు, వినోదానికి సంబంధించిన ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉన్నాయి. సాంసంగ్ నియో QLED 65 అంగుళాల టీవీని రూ.1,75,000 నుంచి రూ.98,990 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అలాగే TCL 55 అంగుళాల QLED టీవీ రూమ్.38,990 తగ్గింపు తర్వాత కొనుగోలు చేయవచ్చు. ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు రూ.31,289 కొనుగోలు చేయవచ్చు. ఇవే కాకుండా మరిన్ని పరికరాలను, వస్తువులను భారీ ఆఫర్లతో విక్రయిస్తున్నట్లు క్రోమా సంస్థ ప్రకటించింది.
