https://oktelugu.com/

Credit Cards: ఏప్రిల్ 1 నుంచి ఈ క్రెడిట్ కార్డులు వాడే వారికి షాక్

ఏప్రిల్ 1 నుంచి కొన్ని ప్రముఖ బ్యాంకులు నిబంధనలు మారుస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కొన్ని రివార్డులను నిలిపివేయనున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 23, 2024 / 09:28 AM IST

    Credit-Cards doubts

    Follow us on

    Credit Cards: క్రెడిట్ కార్డు వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. మారుతున్న కాలంలో డబ్బు అవసరం ఎక్కువగా ఏర్పడుతుంది. అసవరాలకు ఇతరులను డబ్బు అడిగే పరిస్థితి ఇప్పుుడు లేదు. దీంతో కొన్ని బ్యాంకులు మినిమండాక్యుమెంటేషన్ తో క్రిడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు వాడడం వల్ల కొన్ని బ్యాంకులు రివార్డు పాయింట్లు ఇస్తుంటాయి. వీటితో కొన్ని వస్తువులను కొనుగోలు చేయొచ్చు. కొంత మొత్తం బ్యాంకులో క్యాష్ రూపంలో యాడ్ అవుతుంది. కానీ ఏప్రిల్ 1 నుంచి కొన్ని ప్రముఖ బ్యాంకులు నిబంధనలు మారుస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కొన్ని రివార్డులను నిలిపివేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    బ్యాంకుల్లో అతిపెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). ఈ బ్యాంకు లిమిట్ గా క్రెడిట్ కార్డులను జారీ చేసింది. అయినా వినియోగదారులకు కొన్ని ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్న వారు రెంట్ పే బిల్లులపై రివార్డు పాయింట్స్ అందించేది. వాటిని తిరిగి క్రెడిట్ బ్యాలెన్స్ లోకి యాడ్ చేసుకునే అవకాశం ఉండేది. అలాగే కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ ఏప్రిల్ 1 నుంచి రెంట్ పే పై వచ్చే రివార్డు పాయింట్లను నిలిపివేయనుంది. ఎస్బీఐ నుంచి రిలీజ్ అయిన కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్ కార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

    ఎస్బీఐ తరువాత ప్రముఖ బ్యాంకుగా ఐసీఐసీఐ గా చెప్పుకోవచ్చు. ఈ బ్యాంకు తాజాగా కొన్ని నిబంధనలను సవరించింది. వచ్చే మూడు నెలల్లో కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ కావాలంటే రూ.35,000 ఖర్చు చేయాలని తెలిపింది. ఇది కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ వంటి వారికి వర్తిస్తాయని తెలిపింది. ఇవి కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరో బ్యాంకు ‘ఎస్’ కూడా లాంజ్ యాక్సెస్ పై నిబంధనలను సవరించింది. దీని యాక్సెస్ పొందాలంటే రూ.10,000 ఖర్చు చేయాలని తెలిపింది.

    యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని నిబంధనలు మార్చింది. ఈ కార్డు ద్వారా లాంజ్ యాక్సెస్ తో పాటు వార్షిక ఫీజులో మార్పులు తీసుకొచ్చింది. పెట్రోల్, బంగారు ఆభరణాలు, బీమా కొనుగోలుపై ఎలాంటి రివార్డు పాయింట్స్ ఉండవని తెలిపింది. అయితే లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50, 000 ఖర్చు చేయాలనే నిబంధనను విధించింది. దీంతో ఇప్పటి వరకు రివార్డు పాయింట్స్ పొందిన వారికి ఇక రావని చెప్పాయి.