Credit card rules 2025: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు లేని వారు చాలా తక్కువ మందే అని అనుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకు అకౌంటు ఉన్న వారు దాదాపు క్రెడిట్ కార్డును తీసుకుంటూ ఉంటున్నారు. క్రెడిట్ కార్డు వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. అవసరానికి అప్పు ఇచ్చే వ్యక్తి వలె క్రెడిట్ కార్డు ఎన్నో రకాలుగా యూస్ అవుతుంది. అయితే క్రెడిట్ కార్డును కొందరు అవసరానికి కాకుండా అదుపుకు మించి వాడుతూ అప్పుల పాలవుతున్నారు. ఈ క్రమంలో బిల్లును చెల్లించేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొందరు బిల్లులు చెల్లించే క్రమంలో సరైన మొత్తం లేకుండా ఉంటారు. ఇలాంటి వారికి క్రెడిట్ కార్డు చెల్లించాలని అనుకునే వారికి మినిమం డ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా చాలామంది ఇప్పటివరకు బిల్లు చెల్లించారు.ఇలాంటి వారు జూన్ 15 నుంచి అలర్ట్ కావాల్సిందే.. ఎందుకంటే?
Also Read: టీ లో చపాతీ వేసుకొని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త
క్రెడిట్ కార్డు వాడినప్పుడు బాగానే ఉంటుంది.. కానీ బిల్లు చెల్లించేటప్పుడు మాత్రం చాలామంది ఆవేదన చెందుతూ ఉంటారు. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువగా బిల్లు వస్తుంది. సాధారణంగానే 10,000 ఖర్చు చేస్తే.. అంతకుమించి బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లులో జీఎస్టీ, ఇతర చార్జీలు యాడ్ అవుతుంటాయి. ఇలా బిల్లు మొత్తం కలిసి అవుట్ స్టాండింగ్ ప్రిపేర్ ఐ గడువు తేదీని ఇస్తారు. కానీ కొంతమంది అవుట్ స్టాండింగ్ పై ఉన్న మొత్తాన్ని చెల్లించడానికి ఇష్టపడరు. ఇందులో మినిమం డ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మినిమం టు తక్కువ మొత్తాన్ని చూపిస్తుంది. ప్రస్తుతానికి కాలం గడవాలని మినిమం డ్యూ చెల్లించేవారు కూడా ఉన్నారు. అయితే ఈ మినిమం డ్యూ ఇప్పటివరకు అవుట్ స్టాండింగ్ లో ఉన్న 30% వరకు మాత్రమే చెల్లించే అవకాశం ఉండేది. ఉదాహరణకు అవుట్ స్టాండింగ్ 30 వేల బిల్లు ఉన్నా కూడా కేవలం రెండు లేదా మూడు వేలు మాత్రమే మినిమం డ్యూ ఉండేది.
జూన్ 15 నుంచి మాత్రం రూల్స్ మారాయని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఇకనుంచి మినిమం డ్యూ మొత్తంలో కేవలం 30 శాతం మాత్రమే కాకుండా ఇందులో జీఎస్టీ, ఇతర చార్జీలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు క్రెడిట్ కార్డు పై రూ. 30000 అవుట్ స్టాండింగ్ మొత్తం ఉంటే.. ఇప్పుడు దాదాపు 16000 మినిమం డ్యూ వచ్చే అవకాశం ఉంది. అంటే మినిమం డ్యూ చెల్లించేవారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
Also Read: భాషా వివాదం ఎవరి ప్రయోజనం కోసం? ప్రజలు అప్రమత్తం కావాలిసిన వేళ!
వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మినిమం డ్యూ మొత్తం అనేది చెల్లించకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మినిమం డ్యూ చెల్లించిన తర్వాత మిగతా మొత్తానికి చక్రవడ్డీ కూడా వేసే అవకాశం ఉంది. అప్పుడు మరింత భారం పడే అవకాశం ఉంది. అందువల్ల క్రెడిట్ కార్డ్ బిల్లులోని అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని క్లియర్ చేయాలి. అప్పుడే ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండా ఉండగలుగుతారు. అలాకాకుండా మినిమం డ్యూ మొత్తాన్ని చెల్లిస్తే ఇబ్బందులకు గురవుతారు.