Pm Kisan: 12 కోట్ల మంది రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాలలో నగదు జమ!

Pm Kisan: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి కాగా కేంద్రం ఈ స్కీమ్ ద్వారా రైతులకు మూడు విడతల్లో ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున ఖాతాలలో జమ చేస్తుండటం గమనార్హం. త్వరలో ఈ స్కీమ్ ద్వారా రైతుల ఖాతాలలో మరోసారి నగదు జమ కానుందని సమాచారం […]

Written By: Kusuma Aggunna, Updated On : March 13, 2022 9:30 am
Follow us on

Pm Kisan: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి కాగా కేంద్రం ఈ స్కీమ్ ద్వారా రైతులకు మూడు విడతల్లో ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున ఖాతాలలో జమ చేస్తుండటం గమనార్హం. త్వరలో ఈ స్కీమ్ ద్వారా రైతుల ఖాతాలలో మరోసారి నగదు జమ కానుందని సమాచారం అందుతోంది.

ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు జమ చేయనుందని తెలుస్తోంది. అయితే రైతులు కేంద్రం అందిస్తున్న ఈ మొత్తాన్ని పొందాలంటే మాత్రం తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆధార్ రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ ను కలిగి ఉంటే సులభంగా ఈకేవైసీని పూర్తి చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈకేవైసీని పూర్తి చేయడం ద్వారా నగదు జమ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.

రైతులు ఈకేవైసీ పూర్తి చేయాలంటే https://pmkisan.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లి ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ను ఎంచుకుని అందులో ఇకేవైసీ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి ఆ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లడం ద్వారా కూడా సులభంగా ఈ పనిని పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్ఛు.