https://oktelugu.com/

Compact SUV: కాంపాక్ట్ SUVల్లో కొత్తకార్లు.. ఎప్పుుడు రాబోతున్నాయో తెలుసా?

ఇప్పటి వరకు వచ్చని వాటి కంటే లేటేస్ట్ టెక్నాలజీతో పాటు అప్డేట్ ఫీచర్స్ ను కలిగిన మరికొన్ని కార్లు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : March 5, 2024 / 03:31 PM IST

    Ciompact SUV Car

    Follow us on

    Compact SUV:  కాలం మారుతున్న కొద్దీ మార్కెట్లోకి కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే చాలా మంది కాంపాక్ట్ SUVలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇవి కమాండింగ్ డ్రైవింగ్, కాంపాక్ట్ స్టైలింగ్ తో పాటు మంచి మైలేజ్ ఇస్తాయి. ఇప్పటి వరకు వచ్చని వాటి కంటే లేటేస్ట్ టెక్నాలజీతో పాటు అప్డేట్ ఫీచర్స్ ను కలిగిన మరికొన్ని కార్లు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇలాంటి కార్ల గురించి నిత్యం తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ ఇన్ఫర్మేషన్..

    SUV కార్లు అనగానే ఎక్కువగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఎక్కువగా వీటిపైనే ఫోకస్ చేస్తుంది. అయితే లేటేస్టుగా కాంపాక్ట్ ఎస్ యూవీలను కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కంపెనీ నుంచి త్వరలో XUV300 ఫేస్ లిస్ట్ రాబోతుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ టర్బో పెట్రెల్ ఇంజిన్లు కలిగి ఉన్నాయి. అలాగే 6 స్పీడ్ టార్క్ కర్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

    టయోటా కంపెనీ సైతం ఎక్కువగా SUVలపై దృష్టి పెడుతుంది. కానీ త్వరలో దీని నుంచి టేజర్ అనే కాంపాక్ట్ SUV రాబోతుంది. ఇది 1.2 లీటర్ నేచుల్ పెట్రోల్, 1.0 లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. అలానే నిస్సాన్ కంపెనీ నుంచి కొత్త మాగ్నైట్ ఫేస్ లిప్ట్ ను తీసుకురాబోతున్నారు. ఇది పాత మాగ్నైట్ నుంచి అనేక మార్పులు కానుంది. ఇందులోని ఫోర్ట్ పోలియోను విస్తరించాలని అనుకుంటున్నారు.

    కియా కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ నుంచి క్లావిస్ కొత్త మోడల్ రాబోతుంది. మైక్రో ఎస్ యూవీ విభాగంలో వచ్చే ఈ కారు 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్, 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఆడాస్ టెక్నాలజీని అమర్చారు. ఇక మహీంద్రా నుంచి మరో కారు XUV300 EV ని తీసుకురానున్నారు. దీనిపవర్ ట్రెయిన్ స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పటికైతే అందుబాటులోకి రాలేదు. అయితే ఇందులో 35 కిలోవాట్ కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కార్లన్నీ వచ్చే ఏడాది లోపు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.