spot_img
Homeబిజినెస్CIBIL Score: సిబిల్ స్కోరు ఇలా ఉంటే తక్కువ వడ్డీ రేట్లు..

CIBIL Score: సిబిల్ స్కోరు ఇలా ఉంటే తక్కువ వడ్డీ రేట్లు..

CIBIL Score: ప్రస్తుతం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వ్యక్తిగత రుణాలు, హోం లోన్లు, వాహన రుణాలు మంజూరు చేసే ముందు ఎక్కువగా పరిశీలించే అంశం సిబిల్ స్కోర్. ఇది ఒక వ్యక్తి గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ఎలా చెల్లించాడో తెలిపే క్రెడిట్ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. అయితే ఈ సిబిల్ స్కోరును భట్టే ఆ వ్యక్తికి ఆఫర్లు, లోన్లు మంజూరు అవుతాయి. ఎలాంటి సిబిల్ స్కోరు ఉంటే ఎంత రుణం మంజూరు అవుతుంది? తక్కవ సిబిల్ స్కోరు ఉంటే ఏమవుతుంది?

సాధారణంగా 750 నుంచి 900 మధ్య సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్లు సులభంగా మంజూరు అవుతాయి. వీరిని బ్యాంకులు తక్కువ రిస్క్ కస్టమర్లుగా పరిగణిస్తాయి. అందువల్ల తక్కువ వడ్డీ రేట్లతో పాటు ఎక్కువ లోన్ మొత్తం కూడా మంజూరు చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రాసెసింగ్ ఫీజులు కూడా తగ్గించే అవకాశముంటుంది. 650 నుంచి 750 మధ్య స్కోర్ ఉన్నవారికి కూడా రుణాలు వస్తాయి. అయితే వీరిపై బ్యాంకులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. అందువల్ల వడ్డీ రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. లోన్ మంజూరుకు అదనపు పత్రాలు లేదా గ్యారంటీ కోరే అవకాశమూ ఉంటుంది.

550 నుంచి 650 మధ్య సిబిల్ స్కోర్ ఉన్నవారికి పరిస్థితి కాస్త కఠినంగా ఉంటుంది. ఈ రేంజ్‌లో ఉన్నవారు గతంలో EMIలు ఆలస్యంగా చెల్లించడం లేదా క్రెడిట్ కార్డు బకాయిలు పెరగడం వంటి కారణాలతో బ్యాంకుల దృష్టిలో రిస్క్ కస్టమర్లుగా కనిపిస్తారు. అందువల్ల లోన్ మంజూరు అవకాశాలు తగ్గిపోతాయి.

300 నుంచి 450 మధ్య స్కోర్ ఉంటే చాలా బ్యాంకులు నేరుగా లోన్ అప్లికేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది తీవ్రమైన క్రెడిట్ సమస్యలను సూచిస్తుంది. గతంలో రుణాలు చెల్లించకపోవడం, డిఫాల్ట్ అవడం లేదా బకాయిలు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండటం వంటి కారణాలు ఇందుకు దారితీస్తాయి.

సిబిల్ స్కోర్ బాగుండాలంటే ఏం చేయాలి?
సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలంటే ముందుగా EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం. ఒక్కసారి కూడా డ్యూ డేట్ మిస్ అయితే అది స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తాన్ని పూర్తిగా ఉపయోగించకుండా 30% లోపే వినియోగించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

అవసరం లేకుండా వరుసగా ఎక్కువ లోన్లకు అప్లై చేయడం కూడా సిబిల్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ప్రతి అప్లికేషన్ సమయంలో బ్యాంకులు క్రెడిట్ చెక్ చేయడంతో స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. పాత క్రెడిట్ కార్డులను అకస్మాత్తుగా మూసేయకుండా కొనసాగించడం కూడా ప్రయోజనకరం. దీని వల్ల క్రెడిట్ హిస్టరీ బలంగా కనిపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version