Chicken Prices: మనలో చాలామంది మాంసాహారంను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. 20 రోజుల క్రితం కిలో చికెన్ ధర 175 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం కిలో చికెన్ ధర 280 రూపాయలుగా ఉంది. మూడు వారాల వ్యవధిలో చికెన్ ధర 100 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెరగడం గమనార్హం. రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మరోవైపు కోళ్ల పెంపకానికి అవసరమైన దాణా ధరలు కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే దాణా ధర రెట్టింపైందని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. నాటు కోడి, కడక్ నాథ్ కోళ్ల మాంసం కిలో 500 రూపాయల వరకు ఉంది. సాధారణ కోళ్లతో పోలిస్తే ఈ కోళ్లలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో ఈ కోళ్లపై చాలామంది ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.
ఎండలు ముదిరితే చికెన్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం. చికెన్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వ్యాపారులు కూడా హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్ తో చేసిన వంటకాల ధరలను పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి.