Cheapest Car In India
Cheapest Car In India : భారత మార్కెట్‌లో కారు కొనుగోలు చేసే వినియోగదారులు అందుబాటు ధరలోనే అధిక భద్రతా ఫీచర్లు ఉన్న వాహనాలను కోరుతున్నారు. ఈ కోవలో హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌ను అత్యంత చౌకైన, కానీ అత్యధిక భద్రతను కలిగిన కారుగా నిలిపింది.
సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ తన అన్ని మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇందులో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కూడా ఉంది. ఇది భారతదేశంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్న అత్యంత చౌకైన హ్యాచ్‌బ్యాక్. ఈ కారు బేస్ వేరియంట్ ఎరాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), వెనుక పార్కింగ్ సెన్సార్లు, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.92 లక్షలు మాత్రమే.
ఇన్నోవేటివ్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఏసీ, వెనుక ప్రయాణీకుల కోసం ఎసీ వెంట్స్, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన మైలేజ్
ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 83 పిఎస్ పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. CNG మోడల్‌ను కోరేవారికి, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ CNG ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. CNG మోడల్‌లో ఇంజన్ 69 పిఎస్ పవర్, 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 16-18 కిమీ మైలేజ్ ఇస్తే, CNG మోడల్ కిలోకు 27 కిమీ మైలేజ్ అందించగలదు.
ధరలు, వేరియంట్లు
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వేరియంట్లు:
* ఎరా (బేస్ వేరియంట్) – రూ. 5.92 లక్షలు
* మాగ్నా – రూ. 6.83 లక్షలు
* కార్పొరేట్ – రూ. 7.06 లక్షలు
* స్పోర్ట్జ్ – రూ. 7.43 లక్షలు
* ఆస్టా (టాప్ వేరియంట్) – రూ. 8.56 లక్షలు
* CNG మాగ్నా వేరియంట్ – రూ. 7.68 లక్షలు
సేఫ్టీకే ప్రాధాన్యం
ఈ హ్యుందాయ్ కారులో హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్ వంటి 30కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి. భద్రత, ధర, మైలేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత ఆఫర్డబుల్ & సేఫ్ కారుగా నిలుస్తోంది.