https://oktelugu.com/

జియో కంటే తక్కువ ధరకే ఇంటర్నెట్.. ఏ విధంగా పొందాలంటే?

టెస్లా బాస్ ఎలన్ మాస్క్ భారతీయులకు తీపికబురు అందించబోతున్నారని తెలుస్తోంది. దేశంలోని ప్రజలకు జియో కంటే చౌక ధరలకే ఇంటర్నెట్ అందుబాటులోకి రానున్నాయని సమాచారం. స్పేస్ఎక్స్ స్టార్ లింక్ ద్వారా ప్రజలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను జియో కంటే తక్కువ ధరకే పొందే అవకాశం ఉంటుంది. దేశీయ టెలీకాం దిగ్గజం జియో ఎంట్రీతో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. స్టార్ లింక్ ద్వారా భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 8, 2021 3:26 pm
    Follow us on

    టెస్లా బాస్ ఎలన్ మాస్క్ భారతీయులకు తీపికబురు అందించబోతున్నారని తెలుస్తోంది. దేశంలోని ప్రజలకు జియో కంటే చౌక ధరలకే ఇంటర్నెట్ అందుబాటులోకి రానున్నాయని సమాచారం. స్పేస్ఎక్స్ స్టార్ లింక్ ద్వారా ప్రజలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను జియో కంటే తక్కువ ధరకే పొందే అవకాశం ఉంటుంది. దేశీయ టెలీకాం దిగ్గజం జియో ఎంట్రీతో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

    స్టార్ లింక్ ద్వారా భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. స్టార్ లింక్ ఇండియా హెడ్ సంజయ్ భార్గవ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ల రేట్లతో పోలిస్తే తక్కువ ధరకే ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌ భారత్ లో స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ సర్వీసులకు ప్రి-బుకింగ్స్ ను ప్రారంభించడం గమనార్హం. 7,500 రూపాయలు చెల్లించడం ద్వారా ఈ ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.

    100 నుంచి 150 ఎంబీపీఎస్ స్పీడ్ తో స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసుల ద్వారా ఇంటర్నెట్ ను పొందవచ్చు. దేశీయ టెలీకాం కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని స్టార్ లింక్ ప్రజలకు ఈ సేవలను అందించనుందని సమాచారం. 2022 సంవత్సరం నుంచి ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.

    స్టార్ లింక్ తన బ్రాడ్ బ్రాండ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుందని వస్తున్న వార్తల పట్ల ఇంటర్నెట్ యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.