https://oktelugu.com/

Hero Vishal: రాజకీయాల్లో ఎంట్రీపై హీరో విశాల్​ ఆసక్తికర వ్యాఖ్యలు!

Hero Vishal: ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా మెల్లగా రాజకీయాలవైపు మొగ్గు చూపడం మనం తరచూ చూస్తుంటాం. ఈ క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన సమయంలో వచ్చి ఉప ఎన్నికల్లో తమిళ హీరో విశాల్​ పోటీ చేసేందుకు సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో విశాల్​ చాలా హడావిడి చేశారు. అయితే, నామినేషన్​ వేసిన తర్వాత విశాల్​కు అనూహ్యంగా షాక్​ తగిలింది. అప్పుడు అందరూ విశాల్​ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారని భావించారు. విశాల్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 7, 2021 / 05:42 PM IST
    Follow us on

    Hero Vishal: ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా మెల్లగా రాజకీయాలవైపు మొగ్గు చూపడం మనం తరచూ చూస్తుంటాం. ఈ క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన సమయంలో వచ్చి ఉప ఎన్నికల్లో తమిళ హీరో విశాల్​ పోటీ చేసేందుకు సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో విశాల్​ చాలా హడావిడి చేశారు. అయితే, నామినేషన్​ వేసిన తర్వాత విశాల్​కు అనూహ్యంగా షాక్​ తగిలింది. అప్పుడు అందరూ విశాల్​ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారని భావించారు. విశాల్​ సొంత పార్టీ కూడా పెట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే, అనుకోకుండా విశాల్​ ఎందుకో కొద్ది రోజులు సైలెంట్​ అయ్యారు. మళ్లీ ఇప్పటి వరకు రాజకీయ పార్టీ గురించి ఎక్కడా ప్రస్థావించలేదు.

    కాగా, తాజాగా ఆయన నటించి ఎనిమి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్​ సందర్భంగా మరోసారి రాజకీయాలపై ప్రస్థావించారు విశాల్​. మళ్లీ రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన విశాల్​ మాట్లాడుతూ.. పూర్తి స్థాయి రాజకీయాలపై ప్రస్తుతం తనకు ఆసక్తి లేదని.. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. తాను సినిమా చేస్తున్న సమయంలో రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే వాటిని ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం మాత్రం ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు.