Senior actress Sri Lakshmi : కొంతమంది నటీనటుల పేర్లు నేటి తరం ఆడియన్స్ కి పెద్దగా తెలియక పోయినా, వాళ్ళు పోషించిన కొన్ని అద్భుతమైన పాత్రల కారణంగా ఎప్పటికీ జనాలు మర్చిపోలేని చెదరని ముద్ర వేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ నటి శ్రీలక్ష్మి(sri Lakshmi). ఈమె పేరు చెప్తే అంత తేలికగా నేటి తరం ఆడియన్స్ గుర్తు పట్టలేరు, కానీ ఈమె ‘బాబు చిట్టి’ మీమ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ ఈమెకి సంబంధించిన మీమ్స్ ని నెటిజెన్స్ ఎదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూనే ఉంటారు. శ్రీలక్ష్మి గా పిలవబడే ఈమె అసలు పేరు ఐశ్వర్య లక్ష్మి ప్రియ. ఈమె ప్రముఖ నటుడు అమర్ నాథ్ కి కూతురు. ఈమె తమ్ముడు రాజేష్ కూడా ప్రముఖ సినీ నటుడే. తన తండ్రి అమర్ నాథ్ కి ఆరోగ్యం చెడిపోయి సినిమాలు చేయడానికి వీలు లేని సమయంలో ఇంటి బాధ్యతలను భుజాన వేసుకొని శ్రీ లక్ష్మి సినీ రంగం లోకి అడుగుపెట్టింది.
తొలిచిత్రమే మహానటుడు ఎన్టీఆర్(NTR) హీరో గా నటించిన ‘కొండవీటి సింహం’ అవ్వడం ఈమె అదృష్టం. అందులో ఈమె పోషించిన పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉండడం వల్ల అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. అలా వరుసగా సైడ్ క్యారక్టర్ రోల్స్ చేసుకుంటూ కెరీర్ ని నెట్టుకొస్తున్న ఈమెకు ‘చంటబ్బాయ్’ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఈమెకు జంధ్యాల అద్భుతమైన కామెడీ క్యారెక్టర్స్ రాసేవాడు. ఆయన తీసే ప్రతీ సినిమాలోనూ శ్రీ లక్ష్మి కోసం ప్రత్యేకంగా క్యారక్టర్ రాసుకునేవాడు. అలా శ్రీలక్ష్మి కి ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఏడాదికి కనీసం పది సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈమె 2020 వ సంవత్సరం లో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాల్లో నటించింది.
వాటిల్లో కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రం కూడా ఒకటి. ఇదంతా పక్కన పెడితే ఈమె తమ్ముడు రాజేష్ కి ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) అనే కూతురు ఉండేది. ఆమె ఇప్పుడు సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి, తెలుగు, తమిళ భాషల్లో ఎంత గొప్ప పేరు సంపాదించుకొని ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం అందంతో మాత్రమే కాదు, టాలెంట్ తో కూడా ఇండస్ట్రీ లో అగ్రస్థాయికి వెళ్ళగలం అని నిరూపించిన హీరోయిన్స్ లో ఒకరిగా ఈమె నిలిచిచిపోయింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiiki Vastunnam) అనే చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తర్వాత ఆమె రేంజ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలుగు లో ఈమె చేసిన సినిమాలు తక్కువే కానీ, తమిళం లో మాత్రం చాలా ఎక్కువ. ఈ చిత్రం తర్వాత తెలుగు లో కూడా ఆమె రెగ్యులర్ గా సినిమాలు చేస్తుందేమో చూడాలి.