Chandrasekaran salary : అంబానీ కాదు.. అదానీ అంతకన్నా కాదు.. దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న కంపెనీ చైర్మన్ ఇతనే

మనదేశంలో అత్యధికంగా డబ్బున్న వాళ్ళు ఎవరంటే.. వెంటనే అంబానీ, అదానీ పేరు గుర్తుకొస్తుంది. ఎక్కువగా వేతనం తీసుకునే వారి పేర్లను పరిశీలనలోకి తీసుకుంటే సన్ గ్రూప్ చైర్మన్ దయానిధి మారన్.. ఆయన సతీమణి కావేరి మారన్ గుర్తుకొస్తారు. అయితే ఇప్పుడు దయానిధి మారన్ కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన భార్య కావేరి మారన్ కూడా తన ప్రథమ స్థానాన్ని కోల్పోయారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 8, 2024 1:04 pm

Chandrasekaran salary

Follow us on

Chandrasekaran salary : మనదేశంలో ప్రఖ్యాత టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీకి చైర్మన్ గా చంద్ర శేఖరన్ వ్యవహరిస్తున్నారు. మిస్త్రీ మరణం తర్వాత చంద్రశేఖరన్ టాటా గ్రూప్ కంపెనీల పగ్గాలు అందుకున్నారు. అయితే ఆయన ఇందుకు గానూ ప్రతి ఏడాది 135 కోట్లు వేతనంగా తీసుకుంటున్నారు. 2023- 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయన ఈ వేతనం అందుకున్నారు. గత ఏడాది వేతనంతో పోలిస్తే ఆయన ఇరువ శాతం అధికంగా అందుకున్నారు. మనదేశంలో ఏ కంపెనీల బాధ్యులు కూడా ఈ స్థాయిలో వేదనం అందుకోలేకపోతున్నారు. టాటా సన్స్ చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ ఏడాదికి 30 కోట్ల వేతనం అందుకుంటున్నారు. చంద్రశేఖరన్ తర్వాత టాటా గ్రూపులో రెండవ అతిపెద్ద వేతనం అందుకుంటున్నది సౌరభ్. 2016లో టాటా గ్రూపు బోర్డులో చంద్రశేఖరన్ చేరారు..2023 -2024 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ 113 కోట్లు వేతనంగా తీసుకున్నారు. ఈయడాది 135.32 కోట్లు వేతనంగా స్వీకరించారు. ఇందులో ఆయనకు 121.5 కోట్లు కమీషన్ గా లభించాయి. మిగిలిన మొత్తం ఆయనకు వేతనంగా దక్కింది.

ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న కృతి వాసన్ వార్షిక వేతనం 25 కోట్లు. ఐ హెచ్ సీ ఎల్ హెడ్ పునీత్ చత్వాల్ 19 కోట్లను వార్షిక వేతనంగా అందుకుంటున్నాడు. టాటా స్టీల్ చీఫ్ టీవీ నరేంద్రన్ ఏడాదికి 17 కోట్లను వేతనంగా స్వీకరిస్తున్నాడు. టాటా సన్స్ గ్రూపులో అనేక కంపెనీలు ఉన్నాయి. కంపెనీలకు చైర్మన్ గా చంద్రశేఖరన్ వ్యవహరిస్తున్నారు. గతంలో నష్టాల్లో ఉన్న కంపెనీలను ఆయన లాభాల్లోకి తీసుకొచ్చారు. మిస్త్రి మరణం తర్వాత టాటా గ్రూప్ లో అనేక కంపెనీలను గాడిలో పెట్టారు చంద్రశేఖరన్. రతన్ టాటాకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా చంద్రశేఖరన్ ఉన్నారు. అందుకే ఆయనకు టాటా గ్రూపులోని కంపెనీ సారధ్య బాధ్యతలను అప్పగించారు.

టాటా స్టీల్ నుంచి మొదలు పెడితే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వరకు అన్నిటిని లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత చంద్రశేఖరన్ కు దక్కుతుంది. కార్పొరేట్ ప్రపంచంలో సంబంధాలను నడపడం.. వ్యాపార లావాదేవీలను మెరుగ్గా నిర్వహించడం.. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందించడం వంటి విషయాలలో చంద్రశేఖర దిట్ట. మిస్త్రీ కంటే ముందు చంద్రశేఖరన్ టాటా గ్రూపు చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత మిస్త్రీ ప్రవేశించడంతో అది ఆగిపోయింది. మిస్త్రి మరణం తర్వాత చంద్రశేఖరన్ కు అవకాశం లభించింది. టాటా గ్రూపులో ప్రమోటర్లకు అజాతశత్రువుగా చంద్రశేఖన్ పేరుపొందాడు. అందువల్లే మిగతా కార్పొరేట్ కంపెనీల కంటే టాటా గొప్పగా వెలుగొందుతోంది. తన బ్రాండ్ విలువను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. మరోవైపు వచ్చే ఏడాది కూడా చంద్రశేఖరన్ వార్షిక వేతనం 40% పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే గనక జరిగితే కార్పొరేట్ సెక్టార్లో అత్యధిక వేతనం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్ గా చంద్రశేఖరన్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.