Mutual Funds: మనలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చనే సంగతి తెలిసిందే. తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి భారీ ఫండ్‌ను సృష్టించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో పెట్టుబడిని ఎప్పుడైనా తగ్గించవచ్చు.
అవసరమైన సమయంలో పెట్టుబడిని పెంచుకోవడం లేదా ఆపేయడం చేయవచ్చు. రోజుకు కేవలం 100 రూపాయలు పొదుపు చేయడం ద్వారా సులభంగా మిలియనీర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్‌లో సిప్ ద్వారా డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్విటీ మార్కెట్‌లో ప్రతి నెలా 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పెట్టిన పెట్టుబడిపై 10 నుంచి 15 శాతం రాబడి వస్తుంది.
Also Read: రోజుకు రూ.20 డిపాజిట్ చేస్తే కోటీశ్వరులయ్యే ఛాన్స్.. ఎలా అంటే?
30 సంవత్సరాల పాటు ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే ఆ మొత్తం 10 లక్షల 95 వేల రూపాయలు అవుతుంది. ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సగటున 12 శాతం రాబడి పొందినా 97.29 లక్షల రూపాయల రాబడి వస్తుంది. ఒకేసారి ఏకంగా కోటీ 8 లక్షల రూపాయలు ఈ విధంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ ఈ మధ్య కాలంలో బాగుంది.
గత ఏడాది కాలంలో కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు పెట్టుబడిదారులకు 100 శాతం కంటే ఎక్కువ మొత్తం రాబడిని ఇచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.
Also Read: ఎల్‌ఐసీ సూపర్ ఆఫర్.. ఐదేళ్లలో రెట్టింపు రాబడి పొందే అవకాశం?