AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. పార్టీల వైఖరి వెల్లడవుతోంది. ఇన్నాళ్లు అంటగాగిన పార్టీలు ఇప్పుడు తలోదారి చూసుకుంటున్నాయి. ఒకరి అవసరం మరొకరికి ఉన్నట్లే ఇన్ని రోజులు దగ్గరగా ఉన్నా ప్రస్తుతం మాత్రం దూరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ బీజేపీ మధ్య కూడా పొసగడం లేదని తెలుస్తోంది. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపి తన వైఖరి వెల్లడించిన బీజేపీ ప్రస్తుతం జగన్ పాలనను ఎండగట్టేందుకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసమే ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది.

ఇందుల భాగంగా మంగళవారం విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ సభ నిర్వహించనుంది. దీనికి బీజేపీ నేత ప్రకాష్ జవదేవకర్ కూడా హాజరుకానున్నారు. తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా అధికారం కోసం జగన్ ప్రభుత్వంపై పోరాడాలని సంకల్పించింది. దీని కోసమే ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ ప్రజాగ్రహ సభ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సభ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: కళాకారుల ప్రతీకారం అధికారానికే ముప్పు.. జగన్ ఆలోచించు !
ఇప్పటికే తెలంగాణలో తమ పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణలో బలం సాధించినట్లే ఏపీలో కూడా తన బలం పెంచుకోవాలని భావిస్తోంది. దీని కోసమే విజయవాడలో సభ నిర్వహించి తన సత్తా చాటాలని చూస్తోంది. దీని కోసమే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం బీజేపీని నిందిస్తూ దాని ఎదుగుదలను తగ్గించేందుకు కుట్రలు పన్నుతోంది. ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని నిందించి లబ్ధిపొందాలని భావిస్తోంది. దీంతో ఆంధ్రలో కూడా బీజేపీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది. దీని కోసమే రాష్ర్ట ప్రభుత్వంపై పోరాటం చేయాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: డ్యామేజ్ పాలిటిక్స్: బలం లేని బీజేపీపై పడ్డ వైసీపీ, టీడీపీ