కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించే వాళ్లకు తీపికబురు అందించింది. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ప్రయోజనాలను కేంద్రం మరి కొంతకాలం పొడిగించడం గమనార్హం. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. 2022 మార్చి 31 వరకు కేంద్రం హెచ్.బీ.ఏ ప్రయోజనాన్ని అందుబాటులో ఉంచనుంది.
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగులు ఇంటికోసం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కింద ముందుగానే డబ్బులు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. తీసుకున్న డబ్బుకు 7.9 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి ఉద్యోగులకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చిందనే సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ హెచ్.బీ.ఏ నిబంధనలను ఇప్పటికే అప్ డేట్ చేసిందనే సంగతి తెలిసిందే.
7వ వేతన సంఘం పే మెట్రిక్స్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను అప్ డేట్ చేయడం గమనార్హం. హెచ్.బీ.ఏ కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాశ్వత ఉద్యోగులతో పాటు 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ కలిగిన తాత్కాలిక ఉద్యోగులు లోన్ ను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లోన్ కింద 34 నెలల బేసిక్ శాలరీకి సమానమైన మొత్తాన్ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.
గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు లేదా ఇంటికి అయిన ఖర్చులో ఏది తక్కువ అయితే దానికి సమానమైన మొత్తం తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రుణాన్ని తీసుకోవచ్చు.