
సీఎం కేసీఆర్ తో సహపంక్తి భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. సీఎం పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సభ పూర్తయ్యాక బయటకు వస్తూ వాంతులు చేసుకున్నారు. రాత్రి మరోసారి వాంతులు, విరేచనాలయ్యాయి. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు అదే రాత్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జి చేసినట్లు సూపరింటెండెంట్ రవిప్రకాశ్ తెలిపారు. అలాగే గ్రామంలో మరో 17 మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇంటింటా తిరిగి వైద్యం అందించినట్లు తుర్కపల్లి ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి సీహెచ్. చంద్రారెడ్డి తెలిపారు.