Homeబిజినెస్Cars Under 10 Lakh: తక్కువ బడ్జెట్‌లో పెద్ద కుటుంబానికి పర్ఫెక్ట్ కార్లు ఇవే!

Cars Under 10 Lakh: తక్కువ బడ్జెట్‌లో పెద్ద కుటుంబానికి పర్ఫెక్ట్ కార్లు ఇవే!

Cars Under 10 Lakh:పెద్ద ఫ్యామిలీ కోసం విశాలమైన కారు కొనుగోలు చేయాలని చాలా మందికి ఉంటుంది. అయితే బడ్జెట్ కారణంగా చాలా మంది చిన్న కార్లతోనే రాజీ పడాల్సి వస్తుంది. కానీ మీ బడ్జెట్ రూ.10 లక్షల వరకు ఉంటే ఈ ధరల శ్రేణిలో మీరు మంచి 7 సీటర్ కార్లను కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి, మహీంద్రా, రెనో వంటి ప్రముఖ బ్రాండ్‌లు విశాలమైన 7 సీటర్ కార్లను అందిస్తున్నాయి.అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Also Read : కారు కొనాలని చూస్తున్నారా.. ఈ ఐదు రాష్ట్రాల్లో డెడ్ ఛీప్

మారుతి ఎర్టిగా (Maruti Ertiga):
మారుతి ఎర్టిగా ఒక పాపులర్ 7 సీటర్ కారు. మారుతి సుజుకి నుంచి వస్తున్న ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.84 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్ ధర రూ.13.13 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఎర్టిగా పెట్రోల్, సీఎన్‌జీ అనే రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు మొత్తం తొమ్మిది వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. వాటిలో ఏడు పెట్రోల్ వేరియంట్లు, రెండు సీఎన్‌జీ వేరియంట్లు ఉన్నాయి.

ఈ కారులో కే15సీ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 6,000 ఆర్పీఎమ్ వద్ద 75.8 కిలోవాట్ల శక్తిని, 4,300 ఆర్పీఎమ్ వద్ద 139 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఇంజన్‌తో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యాడ్ చేయబడి ఉంటుంది. విశాలమైన ఇంటీరియర్, మంచి మైలేజీ ఈ కారు స్పెషాలిటీ.

మహీంద్రా బొలెరో (Mahindra Bolero):
మహీంద్రా బొలెరో కూడా విశాలమైన కారు. ఇది 7 సీటర్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. మహీంద్రా నుంచి వస్తున్న ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.9.79 లక్షల నుంచి ప్రారంభమై రూ.10.91 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో ఎంహెచ్ఏడబ్ల్యూకే 75 బీఎస్6 ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 55.9 కిలోవాట్ల శక్తిని, 210 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా బొలెరో ప్రీమియం కేబిన్ స్పేస్ తో వస్తుంది. ఈ కారులో సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. ఇది డైమండ్ వైట్, డీశాట్ సిల్వర్, లేక్‌సైడ్ బ్రౌన్ అనే త్రి కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది. ఈ కారులో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, డిజిటల్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ కూడా ఉన్నాయి. స్ట్రాంగ్ బాడీ, గ్రామీణ ప్రాంతాలకు అనుకూలమైన సస్పెన్షన్ దీని స్పెషాలిటీలు.

రెనో ట్రైబర్ (Renault Triber):
రెనో ట్రైబర్ ఒక అల్ట్రా మోడ్యులర్ 7 సీటర్ కారు. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ 7 సీటర్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.74 లక్షల నుంచి మొదలవుతుంది.

రెనో ఈ కారులో 625 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. కారులో 23 లీటర్ల ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ కారులో 20.32 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్, 17.78 సెంటీమీటర్ల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. ఇది దేశంలో అత్యంత చౌకైన 7 సీటర్ కార్లలో ఒకటి. మోడ్యులర్ సీటింగ్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ దీని స్పెషాలిటీలు.

మీ అవసరాన్ని, ప్రాధాన్యతల ఆధారంగా ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోండి.

Also Read : రేపే రారాజులా మార్కెట్లోకి రిలీజ్ కాబోతున్న క్లాసిక్ 650.. ఇక తిరుగు లేదంతే !

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular