Biz Car : సాధారణంగా మనం కార్ల గురించి మాట్లాడేటప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలే మన గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ కొత్త దిశలో పయనిస్తోంది. గాలితో, నీటితో నడిచే వాహనాలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు వైన్‌తో నడిచే కార్లు వచ్చేశాయ్. ఏంటి నమ్మడం లేదా.. ఇది నిజం. ఏ కార్లు వైన్‌తో నడుస్తాయి. దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాం. వైన్‌తో నడిచే కార్ల ఆలోచన మొదట పరిశోధన ప్రాజెక్ట్‌లో భాగంగా వచ్చింది. వైన్‌లో ఉండే ఇథనాల్ ఒక రకమైన ఆల్కహాల్ అని, దీనిని ఇంధనంగా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. ఇథనాల్ ఒక పునరుత్పాదక వనరు. ఇది చెరకు, మొక్కజొన్న, ద్రాక్ష వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి పొందవచ్చు. దీని వాడకంతో మనం సంప్రదాయ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు.
ఇథనాల్ ప్రత్యేకత ఏమిటి?
వైన్ నుండి పొందిన ఇథనాల్ ఒక పునరుత్పాదక వనరు, ఇది పర్యావరణానికి సురక్షితమైనది. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే, ఇథనాల్ కాల్చడం వల్ల తక్కువ హానికరమైన వాయువులు విడుదలవుతాయి. అలాగే, ఇథనాల్ అధిక శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది వాహనాలకు మెరుగైన వేగం, శక్తిని అందజేస్తుంది.
వైన్‌తో నడిచే కార్ల ప్రత్యేకత ఏమిటి?
వైన్‌తో నడిచే కార్లలో ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించాలంటే కొన్ని సాంకేతిక మార్పులు అవసరం. ఈ కార్ల ఇంజన్లు ఇథనాల్ కోసం ప్రత్యేకంగా సవరించబడ్డాయి. అంటే ఇంజిన్ కొన్ని భాగాలను బలోపేతం చేయాలి. ఇంధన వ్యవస్థను సవరించాలి. వైన్‌తో తయారు చేసిన ఇథనాల్‌ను ట్యాంక్‌లో నింపడం ద్వారా నేరుగా ఉపయోగించవచ్చు. అయితే దానిని సరిగ్గా ఫిల్టర్ చేయాలి. ఆధునిక కార్లలో ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థలు ఉపయోగించబడతాయి. తద్వారా ఇథనాల్ ద్రావణాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. ఇథనాల్ ను మండిచడం ద్వారా కారు వేగంగా పరిగెత్తుతుంది.