Flying cars : గాల్లోకి ఎగిరే కార్లు.. త్వరలో అందుబాటులోకి.. ధర ఎంతో తెలుసా?

ఆకాశంలో ప్రయాణించాలంటే విమానం లేదా హెలీ క్యాప్టర్ లో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇందులో జర్నీ చాలా కాస్ట్లీగా ఉంటుంది. మనం కొనుగోలు చేసిన కారు అవసరం ఉన్నప్పుడు నేలపై.. ఆ తరువాత గాల్లోకి ఎగరాలని చాలా మంది కోరుకుంటారు. ఇటువంటి కారును టర్కీ దేశం అభివృద్ది చేసింది.

Written By: Chai Muchhata, Updated On : August 28, 2024 3:55 pm

Flying cars

Follow us on

Flying cars : కారులో షికారు కెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కావాల్సిన ప్రదేశానికి అనుకున్న సమయంలో, సౌకర్యవంతంగా ప్రయాణించాలంటే సొంత కారు ఉండాలి. మిగతా వాహనాల కంటే కారులో వేగంగా వెళ్లొచ్చు. అంతేకాకుండా డ్రైవర్ సాయంతో కారులో వర్క్ చేసుకుంటూ ప్రయాణించవచ్చు. అయితే కరోనా తరువాత చాలా మంది సొంత కార్లను కలిగి ఉంటున్నారు. దీంతో పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా కార్లే కనిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారి ట్రాపిక్ జామ్ అయితే కారులో ఉన్నవాళ్లు నరకం అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ ట్రాఫిక్ లేకుండా కారులో ఎగిరిపోతే బాగుండు.. అని అనిపిస్తుంటుంది. కానీ ఇది మాటల వరకు మాత్రమే అనుకుంటాం. కానీ ఇప్పుడు అది నిజమైంది. కారులో నేలపై మాత్రమే కాకుండా ఆకాశంలో కూడా తిరగవచ్చు. అదెలాగో? ఆ స్టోరీ ఏంటో తెలుసుకోండి..

ఆకాశంలో ప్రయాణించాలంటే విమానం లేదా హెలీ క్యాప్టర్ లో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇందులో జర్నీ చాలా కాస్ట్లీగా ఉంటుంది. మనం కొనుగోలు చేసిన కారు అవసరం ఉన్నప్పుడు నేలపై.. ఆ తరువాత గాల్లోకి ఎగరాలని చాలా మంది కోరుకుంటారు. ఇటువంటి కారును టర్కీ దేశం అభివృద్ది చేసింది. అయితే ఆ దేశం ఇటువంటి కారును తయారు చేయడం ఇప్పుడే ప్రారంభించింది. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు రిలీజ్ అయ్యాయి.

వినూత్న కారును అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచించిన టర్కీ దేశంలోని ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్ కార్ ఈ కారును తయారు చేస్తోంది. ఈ కారు వల్ల ట్రాఫిక్ రద్దీ సమయంలో ఎగురుకుంటూ.. మిగతా చోట్ల నేలపై వెళ్లొచ్చు. ఈ ఏడాది చివరి నాటికి దీనిని మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కారుపై 300 లకు పైగా టెస్టింగ్ లు నిర్వహించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఆటోమేటిక్ ల్యాండింగ్ సిస్టమ్, సేప్టీ ఫీచర్స్ ఉన్నాయి. టర్కీలోని ఇన్ఫర్మేటిక్స్ వ్యాలీ టెక్నాలజీలో దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో ఇద్దరు ప్రయాణించవచ్చు.

దీని ధర 2 లక్షల నుంచి 2.5 లక్షల డాలర్లకు వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని ధర రూ.1.67 కోట్లు ఉంటుంది. ఎగిరే కారు గురించి బయటి ప్రపంచానికి తెలియగానే మంచి రెస్పాన్స్ వస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఈ కొత్త సాంకేతికత ఎగిరే కారు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని భావిస్తున్నారు. టర్నీ మొదలు పెట్టిన ఇటువంటి కార్లపై అమెరికాతో పాటు దుబాయ్ వంటి దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఇటువంటి కార్లు అందుబాటులోకి వస్తాయా? లేవా? చూడాలి.

అయితే ఇటువంటి కార్లకు అన్ని ప్రదేశాల్లో అనువైన వాతావరణం ఉండే అవకాశం లేదని అంటున్నారు. కానీ ఎగిరే కార్ల ఉత్పత్తిని మిగతా దేశాలు ప్రారంభిస్తే దీని ధర తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడొస్తున్న కారు కంటే మరిం ఆకర్షణీయంగా ఎగిరే కార్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా టర్కీ రూపొందించిన కారు 2025లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.