Car Sunroof : ప్రస్తుత రోజుల్లో ప్రతి కారులోనూ సన్ రూఫ్ ఒక ముఖ్యమైన ఫీచర్ అయిపోయింది. ఇది కారుకు ప్రీమియం లుక్ కూడా అందిస్తుంది. అయితే, కదులుతున్న కారులోంచి బయటికి వచ్చి సరదాగా గడపడానికి సన్‌రూఫ్ తయారు చేశారని అంతా అనుకుంటారు.. అలా చేయడం ట్రాఫిక్ పోలీస్ చూస్తే మీకు చాలాన్ పడడం ఖాయం. ఈ ఇన్నోవేషన్ అసలు ఉద్దేశం వేరే ఉంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. కారులో సన్‌రూఫ్ పెట్టే ఆలోచన వాస్తవానికి పశ్చిమ దేశాల నుండి వచ్చింది. దీని వెనుక ఒక సైంటిపిక్ ఉద్దేశం ఉంది.
కారులో సన్‌రూఫ్ ఎందుకు పెడతారంటే
పశ్చిమ దేశాలలో ఎక్కువ కాలం చలికాలమే ఉంటుంది. అంతేకాకుండా వాటిలో చాలా దేశాలు భూమి ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. దీనివల్ల అక్కడ సూర్యరశ్మి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కారు అద్దాలు ఎక్కువ సేపు మూసి ఉంటే అది కారు ఉష్ణోగ్రతను పెంచుతుంది. సన్‌రూఫ్‌ను అలా డిజైన్ చేశారు.. అది కారు క్యాబిన్‌లో ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఇది కారు లోపల ఆక్సిజన్ లెవల్ కూడా మెయింటెయిన్ చేస్తుంది. ఎందుకంటే అద్దాలు మూసి ఉండడం వల్ల లోపల ఏర్పడే వేడి వాయువు, పైకప్పుపై ఉన్న సన్‌రూఫ్‌ను తెరవడం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
Also Read : మార్కెట్లో ఉన్న బెస్ట్ సన్ రూఫ్ పీచర్ కార్లు ఇవే.. వీటిని ఎందుకు ఎక్కువగా కోరుకుంటున్నారు?
సన్‌రూఫ్ మరొక ప్రయోజనం ఏమిటంటే.. ఇది కారు ఏరోడైనమిక్స్ మీద ప్రభావం చూపదు. వాస్తవానికి మీరు కారును వేగంగా నడుపుతున్నప్పుడు దాని ఏరోడైనమిక్స్, మైలేజ్‌ను పెంచడానికి కారు అద్దాలను మూసి ఉంచాలి. కానీ ఇది కారు లోపల ఉష్ణోగ్రత, స్వచ్ఛమైన గాలి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అందుకే ఏసీ వేసుకొని దానిని మేనేజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడే స్లైడర్ సన్‌రూఫ్ ఉంటే మీరు దానిని తెరిచి హాయిగా కారు నడపవచ్చు. ఇది మీ కారు మైలేజ్‌ను పాడు చేయదు. అంతేకాకుండా క్యాబిన్‌లో స్వచ్ఛమైన గాలి స్థాయిని కూడా మెయింటెయిన్ చేస్తుంది.
సన్‌రూఫ్ మరొక ప్రయోజనం ఏమిటంటే.. ఇది కారులో నేచురల్ లైట్ లెవల్ మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీ కారు లైఫ్ కూడా బాగుంటుంది. అయితే కదులుతున్న కారులో సన్‌రూఫ్ నుండి సరదాగా బయటికి రావడం ప్రమాదకరం. ఇది మిమ్మల్ని ప్రమాదానికి గురి చేయడమే కాకుండా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు జరిమానాకు కూడా పడేలా చేస్తుంది.
Also Read : సన్ రూఫ్ ఫీచర్ తో తక్కువ బడ్జెట్ కార్లు కొనాలనుకుంటున్నారా..? టాప్ మోడల్స్ ఇవే..