Car Sales: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీల్లో మారుతి ఒకటి. ఈ కంపెనీకి చెందిన ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చి అలరించాయి. కానీ కొన్ని మోడళ్లు మాత్రం దశాబ్దాలుగా అమ్మకాలు జరుపుకుంటూనే ఉన్నాయి. వీటిలో ఆల్టోకే 10, వ్యాగన్ ఆర్, స్విప్ట్ వంటివి ఉన్నాయి. వీటిలో స్విప్ట్ పై వినియోగదారుల ఎక్కువగా మక్కువ పెంచుకున్నారు. ఇది చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండడంతో పాటు 5గురు సురక్షింతగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఫీచర్స్, మైలేజ్ తో పాటు లో బడ్జెట్ లో అందుబాటులో ఉంటుంది. అందువల్ల స్విప్ట్ కోసం ఎగబడుతూ ఉంటారు. అయితే 2024 డిసెంబర్ లో ఈ కారును రోజుకు 1000 మంది చొప్పున కొనుగోలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
మారుతి నుంచి స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు.అలాగే CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ లో ఈ కారు 24.80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లో 25.75 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. ఇక సీఎన్ జీ వెర్షన్ లో ఈ మోడల్ 32.85 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.
మారుతి స్విప్ట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఉన్ానయి. ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు వైర్ లెస్ ఛార్జర్, సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఆకట్టుకుంటున్నాయి. జర్నలో వినోదం కోసం ఆర్కామిస్ ట్యూన్డ్ సిస్టమ్ తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇందులో 265 లీటరల్ బూట్ స్పేస్ ఉండడంతో ప్రయాణికులకు విపరీతంగా ఆకట్టుకుటోంది. మారుతి స్విప్ట్ గత మేలో కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ మోడల్ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి.
2024 ఏడాదిలో ఈ కారును 2,52,693 యూనిట్లు విక్రయించారు. ఇదే మోడల్ 2023లో 2.30 లక్షల మంది కొనుగోలు చేశారు. అయితే 2024లో డిసెంబర్ నెలలోనే దీనిని 30 వేల మంది కొనుగోలు చేశారు. అంటే దాదాపు రోజుకు వెయ్యిచొప్పున కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో 2024 ఏడాదిలోనే మారుతి స్విప్ట్ కారు అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
మారుతి తరువాత మార్కెట్లోకి ఎన్నో మోడళ్లు వచ్చాయి. కానీ స్విప్ట్ కు ఉన్న ఆదరణ తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ కారును రూ.6.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. లో బడ్జెట్ లో ఈ కారు అందరికీ అందుబాటులో ఉండడంతో దీనిని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే సాధారణంగా ఒక్క నెలలో 30 వేల కార్లు కొనుగోలు చేయడం అంటే మాటలు కాదు. కానీ మారుతి స్విప్ట్ కు ఇది సాధ్యమైంది. దీంతో మారుతి కంపెనీకి ప్రశంసలు వస్తున్నాయి.