https://oktelugu.com/

Car Luggage: కారులో లగేజీ ఎంత వరకు తీసుకెళ్లాలి? ఎక్కువైతే ఏమవుతుంది?

కారులో లగేజీ వేయడానికి వెనుకభాగం స్పేజ్ ఉంటుంది. ఇది సీఎన్ జీ కార్లలో తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ప్రాదేశంలో సీఎన్ జీ సిలిండర్లను అమరుస్తారు. అయితే ఇక్కడ లగేజీని ఉంచేటప్పుడు బ్యాక్ సైడ్ మిర్రర్ మూసి వేసే విధంగా ఉండకూడదు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 29, 2024 / 10:13 AM IST

    Car Luggage

    Follow us on

    Car Luggage:  ఫ్యామిలీ లైఫ్ లో కారు ఓ భాగం అయింది.కుటుంబ సభ్యులంతా కలిసి ప్రయాణాలు చేయడానికి ప్రస్తుతం బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది సొంత వెహికల్ కొనుక్కొంటున్నారు. కొందరు కార్యాలయ అవసరాలతో పాటు విహార యాత్రలకు వెళ్లేందుకు అనుగుణంగా ఉండేందుకు అనుగుణంగా ఉండే వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ యూవీ వెహికల్స్ పై దృష్టి సారిస్తున్నారు. ఎస్ యూవీ కార్లలో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులతో పాటు అవసరమైన లగేజీని తీసుకెళ్లొచ్చు. అయితే కారులో ఎంత వరకు లగేజీని తీసుకెళ్లాలి? అనే విషయంపై చాలా మందికి సందేహం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

    విహార యాత్రలకు వెళ్లేవారు కొంత లగేజీని తీసుకెళ్తారు. కొందరు మినిమిం వస్తువులను తీసుకెళ్తారు. కొందరు ఆహార పదార్థాలతో పాటు ఇతర వస్తువులను వెంట తీసుకెళ్తారు. అయితే ఏ వస్తుువులు తీసుకెళ్లినా ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కారులో ఉండే లేగేజీని సరైన విధంగా సెట్ చేసుకోకపోవడంవల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల కారులో లగేజీ తీసుకెళ్లాలనుకునేవారు లగేజీ విషయంలో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.

    కారులో ఉండే స్పేస్ ను లీటర్లలో కొలుస్తారు. ఒక కారులో 450 లీటర్ల స్పేస్, 350 లీటర్ల స్పేస్ అని కొలుస్తారు. దీనిని బట్టి లగేజీని ఎంత వరకు తీసుకెళ్లొచ్చనే విషయం తెలుస్తుంది. అయితే చాలా మంది వీటిని పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన విధంగా సామాగ్రిని తీసుకెళ్తారు. దీంతో కారులో వెయిటేజ్ ఎక్కువై మైలేజ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. రోడ్డు సరిగ్గా లేని ప్రాంతంలో కారులో ఉండే వెయిటేజ్ వల్ల కొన్ని పార్ట్ లు దెబ్బతినే అవకాశం ఉంది.

    కారులో లగేజీ వేయడానికి వెనుకభాగం స్పేజ్ ఉంటుంది. ఇది సీఎన్ జీ కార్లలో తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ప్రాదేశంలో సీఎన్ జీ సిలిండర్లను అమరుస్తారు. అయితే ఇక్కడ లగేజీని ఉంచేటప్పుడు బ్యాక్ సైడ్ మిర్రర్ మూసి వేసే విధంగా ఉండకూడదు. ముఖ్యంగా వెనుక సీటు ప్రాంతంలో కొంత స్పేస్ ఉంటుంది. ఈప్రదేశంలో వస్తువులు పెట్టడం వల్ల బ్యాక్ సైడ్ కనిపించదు. దీంతో ప్రంట్ మిర్రర్ వ్యూలో తేడాలు వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల లగేజీని ఏర్పాటు చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ ఉండేలా చూసుకోవాలి.