Car Lights : మీ కారులో ఎన్ని రకాల లైట్లు ఉంటాయో తెలుసా? వాటి పేర్లు ఏమిటి? వాటి పనితీరు ఎలా ఉంటుంది? రాత్రిపూట వెలుతురు ఇవ్వడం నుంచి రోడ్డు మీద సిగ్నల్ ఇవ్వడం వరకు.. భద్రతను పెంచడానికి కూడా కార్లలో ఎన్నో రకాల లైట్లను ఉపయోగిస్తుంటాము. వాటిలో ముఖ్యమైనది హెడ్‌లైట్. హెడ్‌లైట్లు కూడా చాలా రకాలు. ప్రతి హెడ్‌లైట్‌కు దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది. మీ కారులో ఉండే వివిధ రకాల హెడ్‌లైట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
హలోజన్ హెడ్‌లైట్లు
ఇవి చాలా పాతవి మరియు సాధారణ హెడ్‌లైట్లు. వీటిలో ఒక చిన్న బల్బులో హలోజన్ గ్యాస్ ఉంటుంది. అది వేడెక్కి కాంతినిస్తుంది. ఇవి ధరలో చౌకగా ఉంటాయి. వీటి కాంతి పసుపు రంగులో ఉంటుంది. తక్కువ దూరం వరకు వెలుతురునిస్తుంది.
హెచ్‌ఐడి హెడ్‌లైట్లు
వీటిని జినాన్ హెడ్‌లైట్లు అని కూడా అంటారు. ఇవి హలోజన్ కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రకాశవంతమైన కాంతినిస్తాయి. తెలుపు-నీలం రంగులో కాంతిని విడుదల చేస్తాయి. వీటిలో గ్యాస్, ఎలక్ట్రిక్ ఆర్క్ ద్వారా కాంతి ఉత్పత్తి అవుతుంది. ఇవి ఖరీదైనవి కానీ చాలా స్పష్టంగా, దూరం వరకు వెలుతురునిస్తాయి.
ఎల్ఈడి హెడ్‌లైట్లు
ఈ రోజుల్లో కొత్త కార్లలో ఎక్కువగా ఎల్ఈడి హెడ్‌లైట్లే కనిపిస్తాయి. ఇవి తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. త్వరగా వేడెక్కవు . చాలా ప్రకాశవంతమైన తెలుపు కాంతినిస్తాయి. ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. చూడటానికి కూడా స్టైలిష్‌గా ఉంటాయి.
మాట్రిక్స్ హెడ్‌లైట్లు
ఇవి అత్యంత ఆధునిక హెడ్‌లైట్లు. వీటిలో సెన్సార్లు, కెమెరాలు ఉంటాయి, ఇవి ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తిస్తాయి. దాని ప్రకారం కాంతి దిశ, వేగాన్ని మారుస్తాయి. ఇవి కంప్యూటర్ కంట్రోల్ ప్రాసెస్ మీద పని చేస్తాయి. ఈ లైట్‌ను అడాప్టివ్ ఎల్‌ఈడీ అని కూడా అంటారు. ఇది ఎదురుగా వచ్చే వాహనంలోని డ్రైవర్ విజిబిలిటీకి అనుగుణంగా ఉంటాయి. ఎదురుగా వచ్చే వాహనాల ప్రకారం కాంతిని అడ్జస్ట్ చేస్తాయి.
మీరు మీ కారులో హై బీమ్, బీమ్ ప్రాముఖ్యతను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇది రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తుంది. ప్రకాశవంతమైన లైట్ల వల్ల డ్రైవర్లు రోడ్డును సరిగా చూడలేరు. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది.