https://oktelugu.com/

Car In EMI: ఈ కారు ఈఎంఐ నెలకు రూ.5 వేలు మాత్రమే.. ధర ఎంతో తెలుసా?

ధర తక్కువైనా ఆల్టో కే 10 మైలేజ్ విషయంలో తగ్గేదేలే అంటోంది. మారుతి ఆల్టో కే 10 1.0 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 66 బీహెచ్ పీ పవర్ తో పాటు 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగిన ఈ కారు లీటర్ కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 23, 2024 / 01:29 PM IST

    Hyundai Creta Car bes sale In 2024

    Follow us on

    Car In EMI: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో కారు ఉండడం కామన్ అయిపోయింది. అయితే ఎలాంటి కారు తీసుకోవాలి? అనే దానిపై చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వినియోగదారులు తమ కార్యాలయాలతో పాటు ఇంటి అవసరాలకు అనుగుణంగా కావాలనుకుంటే ప్రత్యేక మైన కార్లు ఉన్నాయి. మంచి డిజైన్, రాయల్ రేంజ్ లో ఉండాలనుకుంటే మాత్రం కాస్త ధర ఎక్కువగా చెల్లించాలి. అయితే సామాన్యులు సైతం కారు కొనుగోలు చేసేలా ఓ కంపెనీ తక్కువ ఈఎంఐ చెల్లించే ఆప్షన్ ను ఇచ్చింది. దీంతో చిన్న జీతాలు పొందేవారు సైతం కారు కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఇది ఏ కారు అంటే?

    కాస్త బడ్జెట్ కలిగిన వారు కారు కొనాలని చూస్తున్నారు. అయితే దీనిపై ఎక్కువ మొత్తం చెల్లించకుండా ఉండాలనుకువారికి మారుతి కార్లు అందుబాటులో ఉంటాయి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా ఆల్టో కే 10 కారు ప్రస్తుతం అత్యంత లో బడ్జెట్ కారుగా పేరు తెచ్చుకుంటుంది. ఈ కారు ను సొంతం చేసుకోవాలంటే 7 సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేలు చెల్లిస్తే చాలు. 5 గురు వ్యక్తులు సౌకర్యవంతంగా ప్రయాణించే ఈ కారు రూ.4,50 లక్షల ప్రారంభం ధరతో విక్రయిస్తున్నారు. రూ.ఒక లక్ష 35 వేలు చెల్లించి నెలనెల ఈఎంఐ చెల్లించి ఈ కారును పొందవచ్చు.

    Aulto K 10 Car

    ధర తక్కువైనా ఆల్టో కే 10 మైలేజ్ విషయంలో తగ్గేదేలే అంటోంది. మారుతి ఆల్టో కే 10 1.0 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 66 బీహెచ్ పీ పవర్ తో పాటు 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగిన ఈ కారు లీటర్ కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక సీఎన్ జీ వెర్షన్ లో 33 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మారుతి సుజుకీ ఆల్టో మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో Std, LXi, VXi, VXi+ఉన్నాయి.

    2023 లో ఆల్టో కే 10 మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని అమ్మకాలు బాగానే ఉన్నాయి. లాంగ్ డ్రైవ్ తో పాటు ఎలాంటి వాతావరణంలోనేనా ఆల్టో కే 10 తట్టుకుంటుంది. అందుకే చిన్న ఫ్యామిలీ కోసం కారు కావాలనుకునేవారు దీనిపై మొగ్గు చూపుతున్నారు. ఇందులో లేటేస్ట్ ఫీచర్స్ కారుతో వస్తాయి. ఆ తరువాత కావాలనుకునే ఫీచర్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.