అమెజాన్ పై బ్యాన్ విధించాలంటున్న వ్యాపారులు.. ఏం జరిగిందంటే..?

దేశంలోని ప్రజలు షాపింగ్ కోసం ఎక్కువగా వినియోగించే వెబ్ సైట్లలో అమెజాన్ ఒకటనే సంగతి తెలిసిందే. గతేడాది చైనా భారత్ మధ్య విభేదాలు తలెత్తిన అనంతరం కేంద్రం ఈకామర్స్ సంస్థలకు విక్రయించే వస్తువులపై తయారు చేసిన దేశం పేరు ఖచ్చితంగా ఉండాలని నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే అమెజాన్ ఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అమెజాన్ పై సీరియస్ అయింది. Also Read: స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. […]

Written By: Kusuma Aggunna, Updated On : November 28, 2020 11:08 am
Follow us on


దేశంలోని ప్రజలు షాపింగ్ కోసం ఎక్కువగా వినియోగించే వెబ్ సైట్లలో అమెజాన్ ఒకటనే సంగతి తెలిసిందే. గతేడాది చైనా భారత్ మధ్య విభేదాలు తలెత్తిన అనంతరం కేంద్రం ఈకామర్స్ సంస్థలకు విక్రయించే వస్తువులపై తయారు చేసిన దేశం పేరు ఖచ్చితంగా ఉండాలని నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే అమెజాన్ ఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అమెజాన్ పై సీరియస్ అయింది.

Also Read: స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. ఏం చేయాలంటే..?

కేంద్రం అమెజాన్ కు ఏకంగా 25,000 రూపాయల జరిమానా విధించింది. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వివరాలను అందించనందు వల్ల బ్యాన్ విధించామని కేంద్రం పేర్కొంది. అయితే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అమెజాన్ కు 25,000 రూపాయల జరిమానా అంటే చాలా తక్కువ మొత్తమని.. అమెజాన్ పై 7 రోజుల నిషేధాన్ని విధించాలని డిమాండ్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ఇతర ఈకామర్స్ సంస్థలపై కూడా నిషేధం విధించాలని సిఎఐటి కోరింది.

Also Read: కారు కొనాలనుకునే వాళ్లకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.4000తో కొత్త కారు మీ సొంతం!

సిఐఐటి జాతీయ అధ్యక్షులు బి సి భారతి, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విదేశీ ఈకామర్స్ దిగ్గజంపై ఇంత తక్కువ మొత్తం చార్జీలు వసూలు చేయడమంటే పరిపాలన వ్యవస్థను అపహాస్యం చేయడమే అని అన్నారు. ఆర్థిక వ్యవస్థపై కలిగే నష్టానికి అనుగుణంగా జరిమానాను విధించాలని సూచనలు చేశారు. అక్టోబర్ నెలలో అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సంస్థలకు కేంద్రం నిబంధనలు పాటించనందుకు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

అమెజాన్ యొక్క సమాధానం సంతృప్తికరంగా లేకపోవడం వల్ల కేంద్రం 25,000 రూపాయల జరిమానా విధించింది. అమెజాన్ కు ఇప్పటికే కేంద్రం జరిమానా విధించగా ఫ్లిప్ కార్ట్ కు కూడా త్వరలో కేంద్రం జరిమానా విధించనుందని సమాచారం.