ఇప్పటికే ఏపీ హైకోర్టు తీర్పులపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ కు అప్పట్లో లేఖ రాసి సంచలనం సృష్టించారు. టీడీపీ నేతలు వేసిన పిటీషన్లలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని సీఎం జగన్ లేఖలో ఆరోపించారు. ఆ పరంపర కొనసాగుతున్న టైంలోనే తాజాగా ఏపీ హైకోర్టు.. జగన్ సర్కార్ కు మరో భారీ షాక్ ఇచ్చింది.
Also Read: పదో తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్ష వాయిదా..?
విశాఖపట్నం గెస్ట్ హౌస్ నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడ కొండపై అతిథి గృహ నిర్మాణం చేపట్టవద్దని అమరావతి జేఏసీ నేతలు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాపులుప్పాడ కొండపై అతిథి గృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరుపనుంది.
ఈ వాదనలు విన్న హైకోర్టు వారం రోజుల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పేర్కొంది.
Also Read: పవన్ ఉసరవెల్లి.. ‘జనసేన’ ఎందుకంటూ ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న?
పిటీషనర్ తరుఫున న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. గ్రే హౌండ్స్ కు ఇచ్చిన స్థలంలో అతిథి గృహం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. గ్రే హౌండ్స్ నక్సల్స్, టెర్రరిస్ట్ వ్యతిరేక దళం, రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే గెస్ట్ హౌస్‌కు కేటాయించిన 30 ఎకరాల్లో చెట్లు కూడా నరకవద్దని ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్